train mishap
-
పాలకొల్లు రైల్వేస్టేషన్ లో విషాదం
పాలకొల్లు సెంట్రల్: ఆప్తులందరినీ ఆత్మీయంగా పలకరించాడు.. అయిన వారికి టాటా చెప్పాడు.. మనసు ఒప్పక సంతోషం ఎక్కువై ఎక్కిన రైలు దిగి బంధువులకు మరోసారి వీడ్కోలు పలికాడు. ఇంతలో రైలు నెమ్మదిగా కదిలింది కంగారులో ఎక్కబోతూ కాలుజారి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. రైల్వే రిటైర్డ్ ఉద్యోగి రైలు కింద పడి మృతిచెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన కట్టుంగ సోమశేఖర్(68) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడి స్వగ్రామం పాలకోడేరు మండలం మోగల్లు కాగా ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నెల రోజులక్రితం అమలాపురానికి చెందిన అమ్మాయితో కుమారుడికి వివాహం జరిపించాడు. కోడలును హైదరాబాద్ తీసుకువెళ్లేందుకు బుధవారం అమలాపురం వచ్చాడు. రోజంతా ఆనందంగా గడిపిన ఆయన ఆ ప్రాంతంలోని ఆలయాలను సందర్శించాడు. గురువారం నరసాపురం–నాగర్సోల్ రైలులో హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా పాలకొల్లు రైల్వేస్టేషన్లో ప్రమాదం జరిగింది. రైలు ఎక్కిన సోమశేఖర్ కిందకు దిగి జాగ్రత్తగా వెళ్లండని చెప్పాడని, ఇంతలో రైలు కదలడంతో కంగారుగా ఎక్కే క్రమంలో కాలుజారి కళ్లముందే దుర్మరణం పాలయ్యాడని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. భీమవరం రైల్వే ఏఎస్సై బి.రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుమారుడు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉంది. అప్పటివరకూ మృతదేహాన్ని మార్చురీలో ఉంచామని రైల్వే పోలీసులు చెప్పారు. -
ఘోర రైలు ప్రమాదంపై మోడీ తీవ్ర దిగ్బ్రాంతి!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో చురేబ్ రైల్వే స్టేషన్ లో జరిగిన గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ ఘోర రైలు ప్రమాదంపై కాబోయే ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగిన సహాయక చర్యలను అందించాలని కేబినెట్ సెక్రెటరీ అజిత్ సేథ్ ను ఆదేశించారు. గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ దుర్భటనలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు మోడీ సంతాపం తెలిపారు. చురేబ్ రైల్వే స్టేషన్ లో ఆగివున్న గూడ్స్ రైలును గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. -
రైలు ప్రమాధ ఘటనా స్ధలానికి చేరుకున్న జగన్
-
రైలు ఢీకొని ముగ్గురి మృతి
సాక్షి, న్యూఢిల్లీ: పాతఢిల్లీ రైల్వేస్టేషన్లో ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చిన గూడ్సురైలు ముగ్గురి ప్రాణా లు తీసింది. పార్సిల్ రైలుకు ఇంజను అమరుస్తుం డగా ఆ రైలు వేగంగా వెనక్కివెళ్లింది. పట్టాలు దిగి పక్కనున్న గోడను కూల్చి ఫుట్‌పాత్‌పైకి వచ్చింది. గోడ శిథిలాలు మీదపడడంతో మహిళతోపాటు ముగ్గురు మరణించారు. ఒక బాలుడు ఈ ప్రమా దం నుంచి తప్పిచుకున్నాడు. అగ్నిమాపక విభాగ వాహనాలు, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టారు. రైల్వేశాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. పోలీసులు సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటన అర్ధరాత్రి 11.45 గంటలకు పాత ఢిల్లీ రైల్వేస్టేషన్లో కౌండియాపుల్వైపు జరిగిందని డీసీపీ తెలిపారు. 20వ నంబరు ప్లాట్ఫారం యార్డులో 10 బోగీల గూడ్సురైలును పార్సిళ్లను లోడ్ చేయడానికి నిలిపి ఉంచారు. ఇంజ ను అమరుస్తుండగా దుర్ఘటన జరిగిందని ప్రత్యక్షసాక్షి చెప్పారు. ఇంజన్ స్పీడ్ ఎక్కువగా ఉండడం వల్ల రైలు వెనక్కి వెళ్లి పార్సిల్ గోదాము గోడను కూల్చుకుంటూ వెళ్లి ఫుట్‌పాత్‌పైకి చేరింది. కూలిన గోడ శిథిలాలు ఫుట్ ఫాత్పై నిద్రిస్తున్న నలుగురిపై పడ్డాయి. పోలీసులు, అగ్నిమాపక వాహనాలు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి వెంటనే ఎయిమ్స్ ట్రామాకేర్ సెంటర్‌కు తరలించారు. వీరిలో పది సంవత్సరాల బాలుడు మినహా మిగతా ముగ్గురు మరణించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఇదిలా ఉంటే..బెంగళూరు నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను బెంగళూరు స్టేషన్ యార్డుకు తరలిస్తుండగా రైలు పట్టాలు తప్పి రోడ్డుపెకైక్కి అపార్ట్మెంటుకు సమీపంలో ఆగిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదు. రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి గ్రేటర్ నోయిడా: వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపై నిలిచి ఉన్న చిన్న ట్రక్కును ఢీకొట్టడంతో నలుగురు మరణించగా, ఇద్దరికి గాయాల య్యాయి. రబుపురా ప్రాంతంలోని యమునాఎక్స్ప్రెస్వైపై మంగళవారం ఉదయం ఆరింటికి ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు ఆగ్రా నుంచి నోయిడావైపు వస్తుండగా ఈ దారుణం సంభవించింది. మృతుల్లో ఒకరిని హర్విందర్ సింగ్‌గా గుర్తించామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.