రైలు ఢీకొని ముగ్గురి మృతి
Published Wed, Nov 27 2013 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
సాక్షి, న్యూఢిల్లీ: పాతఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చిన గూడ్సురైలు ముగ్గురి ప్రాణా లు తీసింది. పార్సిల్ రైలుకు ఇంజను అమరుస్తుం డగా ఆ రైలు వేగంగా వెనక్కివెళ్లింది. పట్టాలు దిగి పక్కనున్న గోడను కూల్చి ఫుట్‌పాత్‌పైకి వచ్చింది. గోడ శిథిలాలు మీదపడడంతో మహిళతోపాటు ముగ్గురు మరణించారు. ఒక బాలుడు ఈ ప్రమా దం నుంచి తప్పిచుకున్నాడు. అగ్నిమాపక విభాగ వాహనాలు, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టారు. రైల్వేశాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. పోలీసులు సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటన అర్ధరాత్రి 11.45 గంటలకు పాత ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో కౌండియాపుల్‌వైపు జరిగిందని డీసీపీ తెలిపారు.
20వ నంబరు ప్లాట్‌ఫారం యార్డులో 10 బోగీల గూడ్సురైలును పార్సిళ్లను లోడ్ చేయడానికి నిలిపి ఉంచారు. ఇంజ ను అమరుస్తుండగా దుర్ఘటన జరిగిందని ప్రత్యక్షసాక్షి చెప్పారు. ఇంజన్ స్పీడ్ ఎక్కువగా ఉండడం వల్ల రైలు వెనక్కి వెళ్లి పార్సిల్ గోదాము గోడను కూల్చుకుంటూ వెళ్లి ఫుట్‌పాత్‌పైకి చేరింది. కూలిన గోడ శిథిలాలు ఫుట్ ఫాత్‌పై నిద్రిస్తున్న నలుగురిపై పడ్డాయి. పోలీసులు, అగ్నిమాపక వాహనాలు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి వెంటనే ఎయిమ్స్ ట్రామాకేర్ సెంటర్‌కు తరలించారు. వీరిలో పది సంవత్సరాల బాలుడు మినహా మిగతా ముగ్గురు మరణించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఇదిలా ఉంటే..బెంగళూరు నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను బెంగళూరు స్టేషన్ యార్డుకు తరలిస్తుండగా రైలు పట్టాలు తప్పి రోడ్డుపెకైక్కి అపార్ట్‌మెంటుకు సమీపంలో ఆగిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించలేదు.
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
గ్రేటర్ నోయిడా: వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపై నిలిచి ఉన్న చిన్న ట్రక్కును ఢీకొట్టడంతో నలుగురు మరణించగా, ఇద్దరికి గాయాల య్యాయి. రబుపురా ప్రాంతంలోని యమునాఎక్స్‌ప్రెస్‌వైపై మంగళవారం ఉదయం ఆరింటికి ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వారు ఆగ్రా నుంచి నోయిడావైపు వస్తుండగా ఈ దారుణం సంభవించింది. మృతుల్లో ఒకరిని హర్విందర్ సింగ్‌గా గుర్తించామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Advertisement