సాక్షి, చెన్నై: తమిళనాడులో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారు. వేతనాల పెంపు, సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో 80 శాతం పైగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. బస్సులు నడవకపోవడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడులోని పలు బస్టాండ్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు అవస్తులు పడుతున్నారు. ఇవే అదునుగా ప్రైవేటు వాహనాల యాజమాన్యాలు అధిక మొత్తంలో ఛార్జీలు దండుకుంటున్నాయి.
కాగా రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కారణంగా సీఎం పళని స్వామితో రవాణా శాఖ మంత్రి విజయ్ భాస్కర్ భేటి అయ్యారు. ఈ భేటీలో కార్మికుల సమ్మె, వారి సమస్యలపై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment