భువనేశ్వర్: రెండు తలల పాము గురించి మీరు వినే ఉంటారు. తలలు రెండు ఉన్నా శరీరం మాత్రం ఒకటే ఉంటుంది. దీన్ని తోడేలు పాము(ఉల్ఫ్ స్నేక్) అని కూడా అంటారు. ఈ అరుదైన పాము గురువారం ఒడిశాలో ప్రత్యక్షమైంది. కియోంజార్‌లో నివాసముంటున్న ఓ ఇంట్లో ఈ పాము కనిపించింది. రెండు తలల బరువు వల్ల అది నేలపై నెమ్మదిగా కదులుతోంది. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారు ఆ ఇంటికి చేరుకుని పామును పట్టుకుని దగ్గరలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. (ప్రాణం కోసం పోరు.. విజేత ఎవరంటే?..)
దీనికి సంబంధించిన వీడియోను అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు అరుదైన పామును చంపకుండా వదిలేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దాన్ని రక్షించడమే కాక తిరిగి తల్లి లాంటి అడవి ఒడిలోకి చేర్చడం నిజంగా గొప్ప విషయమంటూ పొగుడుతున్నారు. మరికొందరు మాత్రం రెండు తలల పామును మొదటి సారి చూస్తున్నామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాములు ఒకటి కంటే ఎక్కువ తలలు కలిగి ఉండటాన్ని పాలీసెఫాలీ అంటారు. ఇవి రాత్రిపూట క్రియాశీలంగా, పగటిపూట క్రియారహితంగా ఉంటాయి. కానీ ఇలాంటి పాములు ఎక్కువ కాలం జీవించలేవు. (టాయిలెట్‌కు వెళ్లేముందు ఓసారి..)
Comments
Please login to add a commentAdd a comment