లండన్: బ్రిటన్ వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయులకు శుభవార్త. ఇకపై వీసా పొందడం కోసం మీరు మీ పాస్‌పోర్ట్‌ను దరఖాస్తు కేంద్రాల్లో సమర్పించాల్సిన పలి లేదు. మార్చి 31 నుంచి ‘‘పాస్‌పోర్ట్ పాస్‌బుక్’’ సేవలను భారత్‌లోని 12 వీసా దరఖాస్తు కేంద్రాల్లో ప్రారంభించనున్నట్టు బ్రిటన్ బుధవారం వెల్లడించింది. దీనిని మొదట దక్షిణ భారతదేశంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
పాస్‌పోర్ట్ పాస్‌బుక్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లయితే వీసా దరఖాస్తు పరిశీలన దశలో ఉన్నా కూడా దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్‌ను తమ వద్దే ఉంచుకోవచ్చు. ఈ సమయంలో వారు ఏ ఇబ్బందీ లేకుండా ప్రయాణించవచ్చు. అవసరమైతే మరో దేశం వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ సేవలను ఒక్కో వీసా కేంద్రంలో రోజుకు 75 మందికి మాత్రమే అందిస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు రూ. 4,200 చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటీష్ వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మందికి వీసా వస్తోందని భారత్‌లో బ్రిటన్ హై కమిషనర్ జేమ్స్ బెవాన్ చెప్పారు.
బ్రిటన్ వీసా ఇక సులభతరం
Published Thu, Mar 27 2014 2:39 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement
Advertisement