ఆర్‌బీఐ చెబితేనే చేశాం
నోట్ల రద్దుపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ ప్రతిపాదన మేరకే కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. వెరుు్య నోట్లను రద్దు చేసిందని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం చెప్పారు. ‘నోట్ల చలామణిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందనడం సరికాదు. నోట్లు చట్ట ప్రకారం చెల్లవనే నిర్ణయాలు తీసుకునే ఆర్‌బీఐ సూచన మేరకు ప్రభుత్వం రూ. 500, వెయ్యి నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది’ అని రవిశంకర్ పేర్కొన్నారు. ఢిల్లీలో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సదస్సులో మాట్లాడుతూ... అప్రకటిత నగదు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని ప్రస్తావించారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం నల్లధనంపై సిట్ ఏర్పాటు నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుతం నీతి, నిజాయితీ దిశగా దేశం అడుగులేస్తుందని... అవినీతి ముద్ర నుంచి భారత్ బయటపడేలా చేయడం అందరి కర్తవ్యమన్నారు.
సాహసోపేత నిర్ణయం: అమర్ సింగ్
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సాహసంతో కూడిన ప్రయోగమని సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్ కొనియాడారు. ఈ నిర్ణయంతో ధనికులు, పేదల మధ్య దూరం తగ్గుతుందని, ఇక నుంచి ప్రజలు పన్నులు ఎగ్గొట్టడానికి బదులు చెల్లిస్తారని చెప్పారు. సరైన ఏర్పాట్లు చేయకుండా ఈ నిర్ణయాన్ని అమలు చేశారని, అరుుతే నల్ల కుబేరులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అమర్‌సింగ్ పేర్కొన్నారు.