Union Minister Ravi Shankar Prasad
-
కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం భేటీ అయ్యారు. మంత్రితో పాటు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఉన్నారు. భేటీ అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో నేషనల్ లా వర్శిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో భారత్ నెట్ పనులు వేగవంతం చేయాలని అడిగామన్నారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ చేయాల్సిన అవసరం ఉందని.. ఏపీలో ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరామని తెలిపారు. అన్ని అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. చదవండి: రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్ పోర్ట్స్ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: గౌతమ్‌రెడ్డి -
ఐటీఐఆర్ సంగతేంటి?
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను పునరుద్ధరించడం లేదా అంతకంటే మెరుగైన మరో కార్య క్రమాన్ని చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభు త్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభు త్వం చెప్తున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటీఐ ఆర్‌ను ప్రారంభించాలని లేఖలో విన్నవిం చారు. కోవిడ్‌లాంటి సంక్లిష్ట సమయంలో ఐటీఐఆర్‌ను పునరుద్ధరిస్తే తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. 2014లో ఐటీఐఆర్ ప్రాజెక్టును సమీక్షించిన అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం అంతకంటే మేలైన పథకం తెస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐటీఐఆర్ భాగస్వాములతో 2017లో విస్తృత స్థాయి చర్చలు జరిగినా కేంద్రం నుంచి ప్రకటన రాని విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఐటీఐఆర్‌ను ప్రకటించి పదేళ్లు.. ‘ఐటీఐఆర్ పేరిట కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుని, 2010లో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేసింది. ఐటీఐఆర్ కోసం 49 వేల ఎకరాలతో పాటు మూడు క్లస్టర్లను కూడా గుర్తించారు. పెట్టుబడులు రప్పించేందుకు రూ.3,275 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రూ.165 కోట్లతో మొదటిదశను 2018 నాటికే పూర్తి చేసి, మిగతా పనులను వివిధ దశల్లో 20 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులో మొదటిదశలో గుర్తించిన పనులకు సంబంధించి అదనపు నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా నిధులు లేక ఐటీఐఆర్ కార్యక్రమాలు ప్రారంభం కాలేదు’అని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. సీఎం లేఖలు రాసినా స్పందన లేదు.. ‘ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదు. అయినా రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి 2019–20 నాటికి రూ.1.28 లక్షల కోట్లకు చేరింది. ఐటీ రంగంలో ఆరేళ్లలో 110 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ.. అలాగే ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపైంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభంలోనూ తెలంగాణ ఐటీ పరిశ్రమలు ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి..’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఐటీ రంగం పూర్వస్థితికి చేరేందుకు కొంతసమయం పడుతుందని, హైదరాబాద్ ఐటీ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. -
నకిలీ వార్తలపై వాట్సాప్ చీఫ్ వాగ్దానం
న్యూఢిల్లీ : వాట్సాప్ చీఫ్ క్రిష్ డేనియల్స్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఐదు రోజుల పర్యటన సందర్భంగా ఆయన భారత్‌కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. వాట్సాప్‌లో విస్తృతంగా వ్యాపించిన నకిలీ వార్తలతో కేంద్ర మంత్రి, వాట్సాప్ అధినేతతో చర్చించారు. వాట్సాప్ ద్వారా తప్పుడు సమాచారం సృష్టించడం, దాన్ని దుర్వినియోగ పరచడం చేస్తే.. తప్పక చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ హామీ ఇచ్చినట్టు రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. వాట్సాప్ నకిలీ వార్తలతో ఇటీవల 20కి పైగా వ్యక్తులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. మూకదాడులు, రివెంజ్ పోర్న్ వంటి నేరాలను ఇవి ప్రేరేపిస్తున్నాయని.. దేశీయ క్రిమినల్ చట్టాలను ఉల్లంఘించే ఈ సవాళ్లకు వెంటనే పరిష్కారాలు కనుగొనాలని మంత్రి, డేనియల్స్‌కు సూచించారు. అంతేకాక, సమస్యల పరిష్కార ఆఫీసర్‌ను కూడా నియమించాలని వాట్సాప్ అధినేతను మంత్రి డిమాండ్ చేశారు. అంతేకాక దేశంలో ఓ కార్పొరేట్ ఆఫీసును తెరవాలని కోరారు. దేశీయ చట్టాల ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తూ.. వాట్సాప్‌ను దుర్వినియోగ పరచకుండా ప్రజా అవగాహన కార్యకలాపాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. భారత ప్రభుత్వం కోరిన అన్ని అభ్యర్థనలను నెరవేరుస్తామని తాము హామీ ఇస్తున్నట్టు వాట్సాప్ చీఫ్ చెప్పారు. కాగ, గత కొన్ని నెలల్లో వాట్సాప్ ద్వారా విస్తరించిన నకిలీ వార్తలతో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మూక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇవి కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారాయి. నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పలుమార్లు వాట్సాప్‌కు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ యజమాన్య సంస్థ ఫేస్‌బుక్‌కు రెండు నోటీసులు కూడా జారీచేసింది. తప్పుడు సమాచారంపై పోరుకు 50వేల డాలర్ల రీసెర్చ్ గ్రాంట్లను కూడా సోషల్ సైంటిస్టులకు కంపెనీ ఆఫర్ చేస్తోంది. అదేవిధంగా ఈ మెసేజ్‌లు ఎక్కడ నుంచి ఫార్వర్డ్ అయ్యాయో కూడా వాట్సాప్ తెలుసుకోవాలని కేంద్ర ఐటీ డిపార్ట్మెంట్ ఆదేశించింది. -
ఫొటోలో ఏదో తేడా ఉందే.. కేంద్ర మంత్రిపై సెటైర్లు
ఢిల్లీ: అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే మంత్రులు.. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రివాజే. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా అదే పనిచేశారు. కానీ అనూహ్యంగా విమర్శలు, సెటైర్లు ఎదుర్కోవల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. మొన్న మే 20న మంత్రిగారు ఉత్తరప్రదేశ్‌లోని గౌతంబుద్ధనగర్ జిల్లా ధనౌరికలాన్ గ్రామంలో పర్యటించారు. డిజిగావ్ పథకంలో భాగంగా అక్కడ వైఫై సేవలను ప్రారంభించారు. పనిలోపనిగా అక్కడి మహిళల ఆధ్వర్యంలో నడుస్తోన్న శానిటరీ ప్యాడ్స్ తయారీ కేంద్రాన్ని సదర్శించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోకు ‘‘ఈ మహిళలను కలుసుకోవడం సంతోషంగా ఉంది. శానిటరీ ప్యాడ్ల తయారీతో వీరికి జీవనోపాధి లభించడమేకాదు, స్త్రీస్వాభిమానాన్ని కూడా నిలబెడుతున్నారు’’ని కామెంట్‌ను జతచేసి ట్వీట్ చేశారు మంత్రిగారు. కాగా, సదరు ఫొటోలో శానిటరీ ప్యాడ్లు తయారుచేసే మహిళల్లో ఒక్కరు కూడా లేకపోవడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ‘ఏంటి సార్.. మహిళల కష్టాన్ని మగవాళ్లు క్యాష్ చేసుకుంటున్నారా?’, ‘శానిటరీ ప్యాడ్లు మగవారికా, ఆడవారికా?’, ‘ఫొటోలో ఏదో తేడా ఉందే!’,.. తరహా కామెంట్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. కొన్ని గంటలకుగానీ పొరపాటును గ్రహించిన మంత్రివర్యులు.. ఆ మహిళలతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌చేశారు. It was heartening to interact with the village women who have set up sanitary pad manufacturing unit in Digi Gaon Dhanauri Kalan. This has not only created source of livelihood but also promoted awareness about menstrual hygiene. This is part of #StreeSwabhiman initiative of CSC. pic.twitter.com/YHGd9nNwGv — Ravi Shankar Prasad (@rsprasad) May 20, 2018 where are the women?😨😨😨 — Vijay V ಬೆಂಗಳೂರು (@vijay4joe) May 21, 2018 uh! why are there no women in the picture? — Asif Khan (@_asif) May 20, 2018 Find a woman in this frame and get ,1 sanitary pad free — hariom sharma (@h_sharma22) May 20, 2018 Why don't I see any women in this photo? Where are the heroines of this commendable efforts? I want to see them.. not bunch of men who wants to steal their credit. — अज्ञात ठेकेदार (@xandoomal) May 20, 2018 Proud of these women of Dhanauri Kalan village in UP who are not only creating awareness about menstrual health but also making low cost sanitary pads, as part of #StreeSwabhiman movement of CSC. They are indeed breaking barriers & transforming lives. pic.twitter.com/Q6CZOBAHu6 — Ravi Shankar Prasad (@rsprasad) May 20, 2018 -
ఆర్బీఐ చెబితేనే చేశాం
నోట్ల రద్దుపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీ: ఆర్బీఐ ప్రతిపాదన మేరకే కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. వెరుు్య నోట్లను రద్దు చేసిందని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం చెప్పారు. ‘నోట్ల చలామణిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందనడం సరికాదు. నోట్లు చట్ట ప్రకారం చెల్లవనే నిర్ణయాలు తీసుకునే ఆర్బీఐ సూచన మేరకు ప్రభుత్వం రూ. 500, వెయ్యి నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది’ అని రవిశంకర్ పేర్కొన్నారు. ఢిల్లీలో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సదస్సులో మాట్లాడుతూ... అప్రకటిత నగదు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని ప్రస్తావించారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం నల్లధనంపై సిట్ ఏర్పాటు నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుతం నీతి, నిజాయితీ దిశగా దేశం అడుగులేస్తుందని... అవినీతి ముద్ర నుంచి భారత్ బయటపడేలా చేయడం అందరి కర్తవ్యమన్నారు. సాహసోపేత నిర్ణయం: అమర్ సింగ్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సాహసంతో కూడిన ప్రయోగమని సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్ కొనియాడారు. ఈ నిర్ణయంతో ధనికులు, పేదల మధ్య దూరం తగ్గుతుందని, ఇక నుంచి ప్రజలు పన్నులు ఎగ్గొట్టడానికి బదులు చెల్లిస్తారని చెప్పారు. సరైన ఏర్పాట్లు చేయకుండా ఈ నిర్ణయాన్ని అమలు చేశారని, అరుుతే నల్ల కుబేరులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అమర్‌సింగ్ పేర్కొన్నారు. -
'మిస్టర్ కేజ్రీవాల్.. ఆర్మీని కించపరచకు'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆర్మీని తక్కువ అంచనా వేసే మాటలు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే మానుకోవాలని బీజేపీ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సర్జికల్ దాడికి ఆధారాలను వెంటనే బయటపెట్టాలని కేజ్రీవాల్ అనడం దురదృష్టకరం అని, ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం మూలంగా నేడు పాకిస్థాన్ ప్రధాన వార్తల్లో నిలిచారని, ఆయన వ్యాఖ్యలు పాక్ సానూకూల అంశంగా మార్చుకొని పతాక శీర్షికలు వెలువరించిందని చెప్పారు. ఆర్మీని కించపరిచేలాగా కేజ్రీవాల్ ప్రకటనలు ఉన్నాయని, దయచేసి అలాంటి మాటలు మానుకోవాలని హితవు పలికారు. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ మాట్లాడారని, దేశభద్రతపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. 'మిస్టర్ కేజ్రీవాల్ మీరొక విషయం తెలుసుకోవాలి. ఈ రోజు పాకిస్థాన్ మీడియా వార్తల్లో మీరే ప్రధాన శీర్షికలుగా ఉన్నారు. రాజకీయాలు వేరు. భారత సైన్యాన్ని కించపరిచేలా ఏమీ చేయకండి ఏమీ చెప్పకండి' అని కేంద్రమంత్రి అన్నారు. దాడులు చేయలేదంటూ పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ తిప్పి కొట్టాలని, సర్జికల్ దాడుల ఫుటేజీ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
లౌకిక, సామ్యవాద పదాలను తొలగించం: కేంద్రం
న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రవేశికలోని లౌకిక, సామ్యవాద పదాలపై చర్చ జరగాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంగళవారం లోక్‌సభలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జీరో అవర్‌లో జ్యోతిరాదిత్య సింధియా(కాంగ్రెస్) ఈ అంశాన్ని లేవనె త్తారు. మంత్రి వెంక య్యనాయుడు స్పందిస్తూ.ఈ పదాలను తొలిగించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు.