న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి కాంగ్రెస్ పార్టీ వణికిపోతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ గందరగోళాన్ని సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, తమను విమర్శించే నైతిక హక్కు కూడా ఆ పార్టీకి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలనలో చిత్తశుద్ధి ఉంటే దేశంలో అవినీతి, నల్లధనం ఎందుకు పెరుగుతుందని ప్రశ్నించారు. దేశంలో చట్టబద్ధంగా పన్నులు కట్టిన వారికి తప్పకుండా మేలు జరుగుతుందని అన్నారు.
డిపాజిట్ అయిన సొమ్మంతా తెల్లడబ్బు కాదని, తాము తీసుకొనే చర్యలకు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వాలని కోరారు. తమను ప్రశ్నించే ముందు కాంగ్రెస్ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. రాహుల్ చిరునవ్వు, వ్యవహార శైలి దేశంలో పెద్దగా బ్లాక్ మనీ లేదన్నట్లుగా ఉన్నాయని చురకలంటించారు. అలాంటప్పుడు నిజంగానే దేశంలో నల్లడబ్బు లేదనే మాటకు కాంగ్రెస్ ఎందుకు కట్టుబడి ఉండటం లేదని ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ కట్టుబాటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కాంగ్రెస్‌కు వణుకుపుడుతోంది'
Published Wed, Dec 28 2016 5:51 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement