మదరసా కమిటీ సంచలన నిర్ణయం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో మదరసా కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిసారిగా ఆగష్టు 15 వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైంది. జెండా ఆవిష్కరణతోపాటు జాతీయ గేయం ఆలపించాలని పేర్కొంటూ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది.
పంద్రాగష్టు సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించటంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం మదరాసా శిక్ష పరిషత్‌ను కోరింది. అందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్రంలో ఉన్న మొత్తం 8వేల మదరసాలన్నింటికి పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగష్టు 15న సరిగ్గా ఉదయం 8 గంటలకు రాష్ట్రంలోని అన్ని మదరసాలలో జెండా ఆవిష్కరణ నిర్వహించి, జాతీయ గేయాన్ని ఆలపించనున్నారు.