న్యూఢిల్లీ: కోర్టు సంబంధిత కేసులు పెట్టడంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళలే ముందున్నారని తాజా నివేదికలో వెల్లడైంది. సుప్రీంకోర్టు కమిటీ అందించిన ఈ నివేదిక ప్రకారం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు కోర్టుల్లో 20,94,086 కేసులు పెట్టినట్లు వెల్లడైంది. వివిధ సబార్డినేట్ కోర్టులతో కలుపుకుని దేశవ్యాప్తంగా 2.18 కోట్ల కేసులున్నాయని వీటిలో 9.58% కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. మొత్తం కోర్టు కేసుల జాబితాలో 4,40,927 కేసులు యూపీ మహిళల ద్వారానే నమోదయ్యాయి.
తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (2,55,122), బిహార్ (2,16,599), పశ్చిమబెంగాల్‌లో (1,74,327), కర్ణాటకలో (1,46,959), తమిళనాడు (1,35,033) ఉన్నాయి. ఇక 6,96,704 కేసులు వివిధ కోర్టుల్లో సీనియర్ సిటిజన్స్ ద్వారా నమోదైనట్లు వెల్లడైంది. రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో 51,13,978, మహారాష్ట్రలో 29,16,559, రాజస్థాన్, పశ్చిమబెంగాల్లో 13 లక్షల పెండింగ్ కేసులున్నాయి. ఇక హైకోర్టుల్లో 2014 డిసెంబరు నాటికి 41.53 లక్షల కేసుల వరకూ పెండింగ్‌లో ఉండొచ్చని అంచనా. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి సుప్రీంకోర్టు ఓ జాతీయ విధానాన్ని ఏర్పాటు చేయాలని, ఈ కేసులన్నింటినీ కంప్యూటీకరించాలని 2004లో సూచించింది.
కేసులు పెట్టడంలో యూపీ మహిళలే ఫస్ట్
Published Sat, Jun 18 2016 1:20 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement