ప్రతీకాత్మక చిత్రం
ఇస్లామాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్‌లోలష్కరే తొయిబాకు చెందిన నేతలు పోటీ చేయనున్నారనే ఊహాగానాల మధ్య అమెరికా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్‌ఈటీతో సంబంధాలున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని కోరినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రజాస్వామ్య హక్కులను కాలారాస్తూ ఎన్నికల్లో పోటీకి దిగిన వారిపై ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఒక ప్రకటలో వెల్లడించింది.
కాగా, మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పేరిట ఓ పార్టీ రిజిస్ట్రేషన్‌కు యత్నించింది. అయితే, ఎంఎంఎల్‌కు లష్కరే సంస్థతో సంబంధాలున్నాయని పేర్కొంటు పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ జూన్‌లో రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించింది. ఈ వ్యవహారంపై అమెరికా సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు పాక్‌లో ఎన్నికలు సామరస్యంగా, రక్షణాత్మకంగా నిర్వహించాలని కోరుతూ ఇటీవల యూరోపియన్ యూనియన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి భయాలకు వెరవకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం నిలదొక్కుకునేలా చేయాలని ఆకాక్షించింది.
Comments
Please login to add a commentAdd a comment