ప్రధాని మోడీకి అమెరికా కోర్టు నోటీసులు
వాషింగ్టన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా కోర్టు నోటీసులు పంపింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి ఆయనకు న్యూయార్క్ కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.ఇందుకు సంబంధించి మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని మోడీని ఆదేశించింది. అలియెన్స్ ఫర్ జస్టీస్ అండ్ అకౌంటబిలిటీ ( ఏజేఎ) దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అమెరికా ....తొమ్మిదేళ్లపాటు మోడీకి వీసా నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా దేశాధినేతగా మోడీకి ఈ కేసు వర్తించదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు మోడీ పర్యటనకు నిరసనగా నల్ల జెండాలను ప్రదర్శిస్తామని అలియెన్స ఫర్ జస్టీస్ అండ్ అకౌంటబిలిటీ ( ఏజేఎ) ప్రకటించింది. ఈ నెల 28న న్యూయార్క్ నగరంలోని మన్ హట్టన్ మధ్యనున్న మోడీ మాదిసన్ స్వ్కేర్ కు విచ్చేసినప్పడు తాము తెలుపుతామని వెల్లడించింది. 2002లో సిక్కుల ఊచకోత సందర్భంగా మోడీ తీసుకున్న చర్యలపై ఈ ప్రజాకోర్టు ద్వారా నిరసనలు తెలుపుతామని పేర్కొంది.