లక్నో: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను రాష్ట్రానికి తీసుకొస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై శుక్రవారం జరిగిన సమీక్షలో ఈమేరకు ఆయన మార్గదర్శకాలు జారీ చేశారు. కార్మికులను రాష్ట్రానికి తెచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి, 14 రోజుల క్వారంటైన్ కాలాన్ని పూర్తిచేసుకున్నవారి వివరాలతో జాబితా తయారు చేయాలని సీఎం చెప్పారు. దశలవారీగా కార్మికులను ఉత్తరప్రదేశ్‌కు తీసుకొస్తామని వెల్లడించారు.
(చదవండి: 19 సార్లు పాజిటివ్ తర్వాత కోలుకున్న మహిళ)
అయితే, సొంత రాష్ట్రం వచ్చిన కార్మికులు స్క్రీనింగ్, టెస్టింగ్ పూర్తయిన తర్వాత ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో 14 రోజులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అనంతరం వారిని రూ.1000 నగదు, రేషన్ అందించి సొంత ఊళ్లకు పంపుతామని సీఎం పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. 20 అంతకన్నా ఎక్కువ కేసులున్న జిల్లాలకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపుతామని సీఎం తెలిపారు. వారంపాటు వారు అక్కడే ఉండి.. లాక్‌డౌన్ పటిష్ట అమలుకు కృషి చేస్తారని చెప్పారు. వైరస్ హాట్‌స్పాట్లకు గుర్తించి.. ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం ఉత్తరప్రదేశ్ నుంచే మొదలైందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.
(చదవండి: మా నాన్న మరణ వార్త విని బాధపడ్డా..)
Comments
Please login to add a commentAdd a comment