న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి కాంగ్రెస్ సీనియర్ ఎంపీ వి.హనుమంతరావును సస్పెండ్ చేశారు. మతమార్పిడి అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలంటూ రాజ్యసభలో వీహెచ్ నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. వీహెచ్ను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. మతమార్పిడుల వ్యవహారంపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న విపక్షం వరుసగా సభా కార్యక్రమాలను అడ్డుకుంటోంది.