మూక హత్యలపై సీఎం సంచలన వ్యాఖ్యలు | Vasundhara Raje Says Lynching Reality Of World Not Just Rajasthan | Sakshi
Sakshi News home page

మూక హత్యలపై రాజస్తాన్‌ సీఎం సంచలన వ్యాఖ్యలు

Published Tue, Jul 31 2018 9:43 AM | Last Updated on Tue, Jul 31 2018 10:08 AM

 Vasundhara Raje Says Lynching Reality Of World Not Just Rajasthan - Sakshi

రాజస్తాన్‌ సీఎం వసుంధరా రాజె

జైపూర్‌ : మూక దాడులు రాజస్తాన్‌కే పరిమితం కాదని, ప్రపంచమంతటా ఈ ధోరణి ఉందని రాజస్తాన్‌ సీఎం వసుంధరా రాజె పేర్కొన్నారు. ఈనెల 20న అల్వార్‌లో గోరక్షకులుగా చెప్పుకునే మూక దాడిలో రక్బర్‌ ఖాన్‌ మరణించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఇలాంటి ఘటనలు రాజస్తాన్‌లోనే కాదు ప్రపంచమంతటా జరుగుతున్నవే. రాజస్తాన్‌లో మాత్రమే జరుగుతున్నవి కాద’ని ఓ న్యూస్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. రక్బర్‌ ఖాన్‌ హత్యోదంతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించడం ద్వారా కఠినంగా వ్యవహరించామన్నారు.

అల్వార్‌ మూకహత్యలో బాధితుడిని ఆస్పత్రికి తరలించడంలో జాప్యం చేసిన ఏసీపీ మోహన్‌ సింగ్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఆవును తరలిస్తున్నాడనే అనుమానంతో రక్బర్‌ ఖాన్‌ (29)ను అల్వార్‌లో కొందరు దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. కాగా, రక్బర్‌ ఖాన్‌ చేతులు, కాళ్ల ఎముకలు ఫ్రాక్చర్‌ అయినట్టు, మృతుడి శరీరంపై 12 గాయాలున్నట్టు రక్బర్‌ ఖాన్‌ పోస్ట్‌ మార్టం నివేదిక వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement