సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ : మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఇందిరాగాంధీ జాతీయ సాంస్కృతిక కేంద్రం, కేంద్ర సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఎంఎస్. సుబ్బలక్ష్మి ఎగ్జిబిషన్’ను ప్రారంభించారు. మన దేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందని, దీన్ని భవిష్యత్తు తరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి తన సంగీతంతో దేశ ప్రజలను ప్రభావితం చేశారన్నారు. ఆమె సుమ ధుర గాత్రాన్ని గాంధీ, నెహ్రూ సైతం ప్రశంసించారని గుర్తుచేశారు.