Ms Subbalakshmi
-
లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో కీర్తి సురేష్
-
ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో..?
ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో హీరోయిన్ కీర్తీ సురేష్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూ΄÷ందిన ‘మహానటి’ (2018)లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు కీర్తీ సురేష్. ఈ చిత్రానికిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారామె. ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సినిమా లతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్న కీర్తి తాజాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించనున్నారని భోగట్టా. ఈ సినిమా దర్శకుడు, నిర్మాణ సంస్థ వంటి వివరాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రని కీర్తీ సురేష్ ΄ోషించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ టాక్. తమిళనాడులోని మధురైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుబ్బలక్ష్మి ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎలా ఎదిగారు? ఆమె ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనందం, విషాద ఘటనల నేపథ్యంలో ఈ బయోపిక్ తెరకెక్కనుందట. ఈ పాత్రకి కీర్తీ సురేష్ సరైన ఎంపిక అని చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా, ఆమె పచ్చజెండా ఊపారని టాక్. కాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి 2004 డిసెంబరు 11న తుది శ్వాస విడిచారు. -
Saxophonist: శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి
సుబ్బలక్ష్మి ఇంటి పేరు ఎవరికీ తెలియదు. ప్రపంచమంతా ఆమెను శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి అనే పిలుస్తుంది. మగవారు మాత్రమే వాయించే ఈ వాయిద్యంలో సుబ్బలక్ష్మి స్త్రీగా ఉనికి సాధించింది. పట్టుచీర, వడ్డాణం ధరించి వేదిక మీద సంప్రదాయ ఆహార్యంలో ఈ ఆధునిక వాయిద్యం మీద వెస్ట్రన్, కర్నాటక్‌లో అద్భుత ప్రతిభ చూపుతుంది. డైరీలో ఒకరోజు కూడా ఖాళీ ఎరగని ఈ బెంగళూరు వాద్యకారిణి సక్సెస్ స్టోరీ. 40 ఏళ్ల సుబ్బలక్ష్మి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలంటే సంవత్సరం ముందు బుక్ చేసుకోవాలి. ఆమె డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. ఇవాళ చెన్నై, రేపు బెంగళూరు, ఎల్లుండి దుబాయ్... ఆమె కచ్చేరీలు సాగిపోతూ ఉంటాయి. భర్త కిరణ్ కుమార్‌కు ఐ.టి. రంగంలో మంచి ఉద్యోగం. కానీ ఈమె కచ్చేరీల బిజీ చూసి ఉద్యోగం మానేసి సాయంగా ఉంటున్నాడు. బెంగళూరులో నివాసం ఉండే సుబ్బలక్ష్మి సొంతింట్లో ఉండేది తక్కువ. కచ్చేరీలకు తిరిగేది ఎక్కువ. కాని ఈ విజయం అంత సులువు కాదు సుమా. ఒక్కతే శిష్యురాలు సుబ్బలక్ష్మి పూర్తిపేరు ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. అవును. మహా గాత్ర విద్వాంసులు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని జ్ఞప్తికి తెచ్చే పేరు. ఆ పేరు ప్రభావమో, ఇంట్లో సంగీతం ఉండటమో సుబ్బలక్ష్మికి కూడా సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. సుబ్బలక్ష్మి తాత మైసూర్ సంస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉండేవాడు. సుబ్బలక్ష్మి తండ్రి సాయినాథ్ మంగళూరులో మృదంగ విద్వాంసుడు. అతడు అనేకమంది సంగీతకారులకు కచ్చేరీల్లో వాద్య సహకారం అందించేవాడు. ఐదో ఏట నుంచే గాత్ర సంగీతం నేర్చుకుంటున్న సుబ్బలక్ష్మి ఒకసారి తండ్రితోపాటు కచ్చేరీకి వెళ్లింది. అది శాక్సాఫోన్ విద్వాంసుడు కద్రి గోపాల్‌నాథ్ కచ్చేరి. అందులో గోపాల్‌నాథ్ అద్భుతంగా శాక్సాఫోన్ వాయిస్తుంటే సుబ్బలక్ష్మి మైమరిచిపోయింది. తాను కూడా శాక్సాఫోన్ నేర్చుకోవాలనుకుంది. అప్పుడు ఆమెకు 13 ఏళ్లు. ఆ రోజుల్లో ఆడపిల్లలు శాక్సాఫోన్ను అంతగా నేర్చుకునేవారు కాదు. గురువులు నేర్పించేవారు కూడా కాదు. అది పూర్తిగా మగవారి వాయిద్యం. కాని సుబ్బలక్ష్మి పట్టుబట్టింది. మొత్తం 16 మంది శిష్యులు ఆ సమయంలో కద్రి గోపాల్‌నాథ్ దగ్గర ఉంటే వారిలో ఒకే ఒక శిష్యురాలు సుబ్బలక్ష్మి. గర్భం దాల్చాక కూడా సుబ్బలక్ష్మి శాక్సాఫోన్ వాయించడంలో ఒక వరుస ఉంటుంది. ఆమె మొదట కర్నాటక సంగీతం వాయించి ఆ తర్వాత ఫ్యూజన్లోకి వస్తుంది. వెస్ట్రన్‌ను, కర్నాటక్ను మిళితం చేసి కచ్చేరీల్లో ఒక ఊపు తెస్తుంది. అది జనానికి నచ్చుతుంది. ఇది కూడా కొంతమంది శాక్సాఫోన్ విద్వాంసులకు నచ్చదు. ఆమెను విమర్శిస్తుంటారు. ‘నన్ను ఎన్నో విమర్శిస్తారు. కాని నేను భయపడలేదు. కచ్చేరీలు కొనసాగించాను. 7 కిలోల శాక్సాఫోన్ను రెండు గంటల పాటు పట్టుకుని కచ్చేరి చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆడది అలా చేయలేదు అనేవాళ్లకు సమాధానంగా నిలిచాను. నా ఊపిరితిత్తుల బలం నాకు సహకరించింది. పెళ్లయి గర్భం దాల్చాక నా శత్రువులు ఇక ఆమె కచ్చేరీలు చేయదు అనే ప్రచారం మొదలెట్టారు. డెలివరీ అయ్యాక కచ్చేరీలు సాధ్యం కాదని ఆర్గనైజర్స్‌ను భయపెట్టారు. దాంతో షోలు బుక్ చేసిన ఆర్గనైజర్స్ అడ్వాన్సులు వెనక్కు ఇమ్మని అడగడం మొదలెట్టారు. నేను పట్టుదలగా ఆ పుకార్లను తోసి పుచ్చాను. రేపు డెలివరీ అనగా ఇవాళ కూడా కచ్చేరీ చేశాను. నిండు గర్భవతిగా స్టేజ్ మీద శాక్సాఫోన్ వాయించింది నేనే అనుకుంటా. అలాగే డెలివరీ అయిన 15 రోజులకు మళ్లీ స్టేజ్ మీదకు వచ్చాను. ఈ రంగంలో నేనేమిటో నిరూపించుకోవాలనే నా పట్టుదలే నాకు బలాన్ని ఇచ్చింది’ అంటుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి సోదరి లావణ్య కూడా శాక్సాఫోన్ విద్వాంసురాలిగా రాణిస్తోంది. వీరు విడివిడిగా కచ్చేరీలు చేసినా కలిసి చేసే కచ్చేరీలు కూడా వీనుల విందుగా ఉంటాయి. ఎన్నో వెక్కిరింతలు సాధనలో అబ్బాయిలు సుబ్బలక్ష్మిని అస్సలు సహించలేదు. ‘నేను శాక్సా పట్టుకుని సాధన చేస్తుంటే వాళ్లు నవ్వుతుండేవారు. కుర్చీ కిర్రుకిర్రుమన్నట్టు ఉంది అనేవారు. గురువు గారి భార్య మా అమ్మకు స్నేహితురాలు. వీళ్లు నవ్వుతుంటే ఆమె బయటికొచ్చి చూసి– వాళ్లు నవ్వనీ ఏమైనా అననీ... నువ్వు మాత్రం ట్రై చేస్తూనే ఉండు. నీకు వస్తుంది అని ఎంకరేజ్ చేసింది. ఆమె ప్రోత్సాహం వల్ల ధైర్యం తెచ్చుకున్నాను. నేను శాక్సాఫోన్ నేర్చుకోవడంలో ప్రోత్సాహం కంటే అవమానమే ఎక్కువ. కచ్చేరీల్లో కావాలని నా టైము మధ్యాహ్నం ఇచ్చేవారు. ఆ సమయంలో ఆడియెన్స్ ఉండరు. మహా అయితే పది నిమిషాలు కేటాయించేవారు. మగవారు సాయంత్రం నిండు సభలో వాయించేవారు. వారికి గంట సమయం దొరికేది. నన్ను ప్రత్యేకంగా మహిళా శాక్సాఫోనిస్ట్ అని విడిగా చూసేవారు’ అని తెలిపింది సుబ్బలక్ష్మి. -
శత వసంతాల గాన కోకిల.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి
శ్రీవారి అనన్య భక్తురాలైన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. ప్రపంచ ప్రసిద్ధ గాయనీమణిగా, భారత గానకోకిలగా, భారతరత్నగా, సంగీత విధుషీమణిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ప్రపంచ దేశాలను తన గాత్ర మాధుర్యంలో మెప్పించిన సుస్వరాల గాన కోకిలగా చరిత్రకెక్కారు. సోమవారం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి 103వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి, తిరుపతి : శ్రీవేంకటేశ్వరస్వామి అనన్య భక్తురాలిగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మి శ్రీవారి వైభవ విశ్వవ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. ఎలాంటి ప్రసార సామగ్రి లేని సమయంలోనే ఆమె శ్రీవారు, అన్నమయ్య సంకీర్తనల తొలి ప్రచారకురాలుగా నిలిచారు. శ్రీవారు, అన్నమయ్య కీర్తనలను ప్రపంచానికి అందించడంలో ఎనలేని సేవచేశారు. శ్రీవారి సుప్రభాతాన్ని మారుమూల గ్రామాలకు తీసుకెళ్లిన ఘనత ఆమెకే దక్కుతుంది. శ్రీవారి సుప్రభాతం ప్రపంచవ్యాప్తంగా నేటికీ ఎమ్మెస్ గొంతుకతో వింటేనే స్వామి నిదురనుంచి మేల్కొంటారనే నానుడు ఉంది. ఆ గొంతుక సుప్రభాతం వింటేనే సంగీత ప్రియులకు సంతృప్తి కలుగుతుంది. ఆమె ఆలపించిన బాలాజీ పంచరత్నాలు, అన్నమాచార్య కీర్తనలు, శ్లోకాలు, భజనలు, స్తోత్రాలు ప్రసిద్ధికెక్కాయి. ఆమె ఆలపించిన సంకీర్తనలు, సుప్రభాతం నేటికీ విరాజిల్లుతున్నాయి. అప్పట్లోనే ఆ రికార్డులు, ప్రచారాల ద్వారా వచ్చిన నిధులను ఆమె టీటీడీకే అందజేసి శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నారు. ఒక్క రూపాయి కూడా ఆశించికుండా శ్రీవారికే కానుకగా ఇచ్చిన ఆ నిధులు ఇప్పుడు వడ్డీతో సహా కోట్లాది రూపాయలు టీటీడీ ఖజానాలో జమ అయ్యాయి. తిరుపతి త్యాగరాజ మండపంలో సప్తగిరి సంగీత విద్వన్మణి బిరుదును ఆమె అందుకున్నారు. ఇదే వేదికలో తన గాత్రంతో శ్రోతలను మైమరపించారు. ఆమె 2004 డిసెంబర్ 11న పరమపదించగా, ఆమె తొలి కాంస్య విగ్రహం తిరుపతిలోనే ఏర్పాటు చేశారు. అప్పటి తుడా చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సంగీతంపై తనకున్న మక్కువ, ఎమ్మెస్ సుబ్బులక్ష్మిపై ఉన్న అభిమానంతో ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి తిరుపతి పూర్ణకుంభం సర్కిల్లో కాంస్య విగ్రహం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. కుటుంబ నేపథ్యం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణంలోని శ్రీమీనాక్షి అమ్మవారి ఆలయ మాడ వీధికి చెందిన వీణ విదూషిమణి షణ్ముఖవడివు, వకీలు మధురై సుబ్రమణ్య అయ్యర్ దంపతులకు 1916 సెప్టెంబర్ 16న జన్మించారు. తల్లి సంగీత విదూషిమణి కావడంతో అక్షరాలకన్నా ముందే సరిగమలను నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే ఆమె ఏకసంథాగ్రాహిగా సంగీతంలో రాణించడం మొదలుపెట్టారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందాన ఆమె 10వ ఏట ఆలపించిన పాటను గ్రామ్ ఫోన్ రికార్డు విడుదల చేయడం సంచలనం సృష్టించింది. 17ఏళ్లకే మద్రాసు మ్యూజిక్ అకాడమీలో కచేరీ చేసి పండితుల చేత ప్రశంసలు అందుకున్నారు. ఎమ్మెస్ గాత్ర ప్రత్యేకత ఓంకారం ప్రజ్వలించే తంబుర శృతికి.. ఎమ్మెస్ తన గొంతు కలిపితే అదో మధురం. సుమధురం, ఆనంద తన్మయం, పరవశం, శ్రవణానందంతో ప్రతిఒక్కరూ భక్తి తన్మయం చెందాల్సిందే. అలాంటి సుమధుర కంఠం నుంచి సుస్వరాలు జాలువారితే ఇక సంగీత శ్రోతలకు వీనులవిందే. తమిళనాడుకు చెందిన ఆమె పరిపూర్ణ తెలుగులో సంకీర్తనలను గానం చేయడం మరో విశేషం. భక్తి, భావం, సాహిత్య సౌలభ్యం, సాహిత్య ఉచ్ఛారణ, రాగంలోని మాధుర్యాన్ని పలికించడంతో ఆమెకు ఆమే సాటి. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సంగీతం ప్రపంచంలో మరెవరికీ అందని కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్నారు. దేశ అత్యున్నత పురస్కారాలను అంది పుచ్చుకున్నారు. శ్రీవారికి సేవచేసి చరిత్ర పుటల్లో నిలిచారు. ఐక్యరాజ్య సమితిలో ఆలపించిన తొలి మహిళగా, తొలి భారతీయురాలుగా కీర్తి గడించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రశంస లందుకున్నారు. ఆమె సుప్రభాతంతోనే శ్రీవారి మేల్కొలుపు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గానం చేసిన శ్రీవారి సుప్రభాతంతోనే సప్తగిరులు సైతం ఉదయిస్తాయి. ఆ అమ్మ పాటలో ప్రాణం ఉంటుంది. శ్రీవారి భక్తురాలిగా ఎనలేని నిస్వార్థ సేవచేశారు. శ్రీవారి వైభవ విశ్వవ్యాప్తంలో ఆమె పాటదే మెదటి స్థానం. సంగీతంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయురాలు. అలాంటి మహోన్నత వ్యక్తి కాంస్య విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. – భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి -
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ : మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఇందిరాగాంధీ జాతీయ సాంస్కృతిక కేంద్రం, కేంద్ర సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఎంఎస్. సుబ్బలక్ష్మి ఎగ్జిబిషన్’ను ప్రారంభించారు. మన దేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందని, దీన్ని భవిష్యత్తు తరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి తన సంగీతంతో దేశ ప్రజలను ప్రభావితం చేశారన్నారు. ఆమె సుమ ధుర గాత్రాన్ని గాంధీ, నెహ్రూ సైతం ప్రశంసించారని గుర్తుచేశారు. -
మంచి గాయకుణ్ని కావాలనుకుంటున్నా :రెహమాన్
భారతీయ సంగీతాన్ని శాసిస్తున్న గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మంచి గాయకుడు కావాలనుకుంటున్నాడట. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలతో సినీ సంగీత అభిమానుల్ని అలరించిన ఈ లెజెండ్, మరింత గొప్ప గాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మీ గౌరవార్థం న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇండిపెండెన్స్ డే కన్సర్ట్‌లో పాల్గొన్న రెహమాన్ మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్,హాలీవుడ్ సినిమాలకు కూడా సంగీతం అందిస్తున్నాడు రెహమాన్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, త్వరలోనే ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేసే ఆలోచన ఉందని తెలిపాడు.అంతేకాదు, ఆ ఆల్బమ్‌తో గాయకుడిగా ఇంకా మంచి పర్ఫామెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపాడు రెహమాన్. తన సంగీతంపై కర్ణాటిక్, తమిళ్, హిందుస్థానీ సంగీతాల ప్రభావం ఉంటుందన్న రెహమాన్, సన్ షైన్ ఆర్కెస్ట్రాతో కలిసి సోమవారం ప్రదర్శన ఇచ్చారు.