మంచి గాయకుణ్ని కావాలనుకుంటున్నా :రెహమాన్
భారతీయ సంగీతాన్ని శాసిస్తున్న గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మంచి గాయకుడు కావాలనుకుంటున్నాడట. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాటలతో సినీ సంగీత అభిమానుల్ని అలరించిన ఈ లెజెండ్, మరింత గొప్ప గాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మీ గౌరవార్థం న్యూయార్క్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇండిపెండెన్స్ డే కన్సర్ట్లో పాల్గొన్న రెహమాన్ మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు.
సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్,హాలీవుడ్ సినిమాలకు కూడా సంగీతం అందిస్తున్నాడు రెహమాన్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, త్వరలోనే ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేసే ఆలోచన ఉందని తెలిపాడు.అంతేకాదు, ఆ ఆల్బమ్తో గాయకుడిగా ఇంకా మంచి పర్ఫామెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపాడు రెహమాన్. తన సంగీతంపై కర్ణాటిక్, తమిళ్, హిందుస్థానీ సంగీతాల ప్రభావం ఉంటుందన్న రెహమాన్, సన్ షైన్ ఆర్కెస్ట్రాతో కలిసి సోమవారం ప్రదర్శన ఇచ్చారు.