కోల్‌కతా: ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల మోత మోగిస్తూ ప‍్రత్యర్థి బౌలర్లకు పరీక్షగా నిలుస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి.. తాజాగా విదార్థులకు సైతం 'పరీక్ష'గా నిలిచాడు. ఎప్పుడూ బ్యాట్‌తో మెరిసే విరాట్ కోహ్లి విద్యార్థులకు పరీక్షగా నిలవడమేమిటి అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే. కాకపోతే విద్యార్థులకు ఓ ప్రశ్న రూపంలో కోహ్లి ఎదురయ్యాడు.
పశ్చిమ బెంగాల్‌లో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కోహ్లి గురించి అడిగారు. అందులో కొంత సమాచారమిచ్చి దాని గురించి వివరిస్తూ రాయమన్నారు. తప్పక సమాధానం రాయల్సిన పది మార్కుల ప్రశ్న అది. ఆ ప్రశ్న కోహ్లి గురించి కావడంతో తొలుత ఆశ్యర్యపడ్డ విద్యార్థులు.. ఆ తర్వాత ఆనందంతో జవాబు రాయడం ప్రారంభించారు.
క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో విద్యార్థులకు కోహ్లి గురించి పరిచయం అక్కర్లేదు. క్రికెట్ అభిమానించేవారికే కాదు, ప్రతి ఒక్కరికి అతని గురించి తెలుసు. అందుకే పరీక్షలో ఈ ప్రశ్న ఇవ్వడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు కోహ్లి గురించి కొంత సమాచారం ఇచ్చారని, అది ఇవ్వకపోయినా మేము సమాధానం రాసేవారమని కొంత మంది విద్యార్థులు కోహ్లిపై అభిమానాన్ని చాటుకున్నారు. ఇది తమ జీవితంలో చిరకాలం గుర్తిండిపోతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment