సివిల్ ఇంజినీర్లను బురద గుంటలో పడేసి.. | Watch Angry Locals From a Karnataka Town Push Two Engineers Into a Pothole | Sakshi
Sakshi News home page

సివిల్ ఇంజినీర్లను బురద గుంటలో పడేసి..

Published Tue, Jul 5 2016 2:21 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

సివిల్ ఇంజినీర్లను బురద గుంటలో పడేసి..

సివిల్ ఇంజినీర్లను బురద గుంటలో పడేసి..

బెంగళూరు: అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించింది. రోడ్డుపై కందకాలు పడినా పట్టించుకోకపోవడంతోపాటు అలా మన్నిక లేకుండా రోడ్లను వేసిన ఇద్దరు ఇంజినీర్ల బుద్ధి చెప్పారు. ఆ నీటి గుంటలో వారిద్దరిన పడేసి సామాన్యుల ఇబ్బంది అర్థమైందా అంటూ నిలదీశారు. ఈ ఘటన కర్ణాటకలోని కొప్పాల్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మల్లప్ప అనే మాజీ సైనికుడు తన స్కూటర్ పై వెళుతూ కోటే రోడ్డులో ఏర్పడిన బురద గుంటలో పడ్డాడు.

ఆ గుంత ఏర్పడి చాలా రోజులయినా ఆ ప్రాంత సివిల్ ఇంజినీర్లు పట్టించుకోలేదు. ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడికి సంబంధిత ఇంజినీర్లు రాగా.. వారితో ఘర్షణపడిన గ్రామస్తులు వారిద్దరిని అదే బురద గుంటలో పడేశారు. వారు లేచే ప్రయత్నం చేస్తుండగా మరోసారి అలాగే తోశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేస్తుండగా ఈ గుంత ఏర్పడి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటికే పలువురు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement