'ప్రపంచానికి ఉత్తమమైన యోగా శిక్షణ ఇవ్వగలిగాం'
ఢిల్లీ: ప్రపంచానికి ఉత్తమమైన యోగా శిక్షణ ఇవ్వగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా జాతినుద్దేశించి తొమ్మిదోసారి రేడియోలో ప్రసంగించిన మోదీ.. యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా విజయవంతం చేశామన్నారు. అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో సహా అన్ని దేశాల్లోనూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశామన్నారు.
ఐక్యరాజ్య సమితి చీఫ్ బాన్ కీ మూన్ కూడా యోగా చేయటం చాలా సంతోషంగా కలిగించదని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. రక్షా బంధన్ కు ముందు మహిళలకోసం ప్రత్యేక పథకం ప్రారంభిస్తున్నామన్నారు. యోగాను ఒక రోజుకే పరిమితం చేయవద్దని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతీరోజూ యోగా చేస్తే.. ఫలితం కచ్చితంగా తెలుస్తుందన్నారు. వర్షాకాలంలో మొక్కలు పెంపకం, నీటి సంరక్షణ చర్యలు చేపడతామన్నారు. ఆకర్షణీయ నగరాలు, అమృత్, అందరికీ ఇళ్లు పథకాలు ప్రవేశపెట్టామన్నారు. 2022 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు నిర్మించాలన్నది తమ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు.