మమతా బెనర్జీకే పట్టం
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికార నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మమతా బెనర్జీ రెండో పర్యాయం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారని పేర్కొన్నాయి. బెంగాల్ లోని 294 అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ 178, వామపక్ష కూటమి 110 సీట్లు గెల్చుకునే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ ఆనంద్ సర్వే వెల్లడించింది. బీజేపీ ఖాతా తెరవనుందని తెలిపింది. ఇతరులు 5 స్థానాలు దక్కించుకుంటారని అంచనా వేసింది.
తృణమూల్ 167, సీపీఎం 75, కాంగ్రెస్ 45, బీజేపీ 4, ఇతరులు 3 చోట్ల గెలుపొందే అవకాశాలు ఉన్నాయని సీఓటర్ సర్వే తెలిపింది. తృణమూల్ 233-253, వామపక్ష కూటమి 38-51, బీజేపీ 1-5 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని బెంగాల్ ఇండియా టుడే సర్వే వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 19న ఓట్లు లెక్కించనున్నారు.