ఆ ఎన్నికల హామీ ఏమైంది?
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లో నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆ హామీ అమలు చేయడంలో బీజేపీ దారుణంగా విఫలమైందన్నారు. నల్లధనాన్ని వెనక్కితెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీ వట్టి మాటలుగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా బీజేపీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మత ఘర్షణలకు పాల్పడుతోందని తీవ్రంగా ఆరోపించారు.
గురువారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శీలంపూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే పేదలకు పక్కాఇళ్లు, తక్కువ ధరకే తాగునీరు, విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.