సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌పై ఇండియా నిషేధం విధించింది. వీటిలో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన టిక్‌టాక్ కూడా ఉంది. నిషేధాజ్ఞలతో ఇప్పటికే టిక్‌టాక్‌ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. అయితే, ఇప్పటికే టిక్‌టాక్‌ను ఇన్స్టాల్ చేసుకున్న వారి పరిస్థితేంటి? ఆ యాప్ పని చేస్తుందా? లేదా దాన్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయాలా? ప్రభుత్వం నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందా? (చైనాను కలవరపెడుతోన్న మరో వైరస్)
టిక్‌టాక్‌తో పాటు మరో 58 యాప్స్ ను ఇండియా బ్యాన్ చేయడం వెనకున్న అసలు కారణం ‘డేటా’. ఈ 59 యాప్స్‌తో ఇండియన్స్ డేటాను చైనా కంపెనీలు తస్కరిస్తున్నాయి. బ్యాన్ విధింపుతో ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు(ఐఎస్పీ), టెలికాం సర్వీసు ప్రొవైడర్లు(టీఎస్పీ) ఈ యాప్స్ ఇండియాలో డేటా, ఇంటర్నెట్ ట్రాఫిక్ యాక్సెస్ చేయకుండా బ్లాక్ చేస్తాయి. ఈ మేరకు ఐఎస్పీ, టీఎస్పీలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. (ముప్పై ఏళ్లలో 13 హత్యలు.. 50 రేప్‌లు)
ఇప్పటికే ఆయా ఫోన్లలో ఇన్స్టాల్ అయి ఉన్న యాప్స్ ఇప్పటివరకైతే మామూలుగానే పనిచేస్తున్నాయి. ఇండియాలో ఉన్న అన్నీ యాప్స్ స్టోర్స్ టిక్‌టాక్‌తో సహా నిషేధానికి గురైన ఏ యాప్‌కూ అప్డేట్స్ చూపించవు. అయినా ఫోన్లలో ఆ యాప్స్‌ను ఉంచుకుంటే భద్రత తగ్గి హ్యాకర్ల బారిన పడే అవకాశం ఎక్కువ. గతంలో ఓ యాప్ నిషేధానికి గురైతే డేటాతో సంబంధం లేకుండా పని చేసేది. కానీ ఇండియన్ నెట్వర్క్స్ కూడా ఈ 59 యాప్స్‌కి డేటా సరఫరా చేయొద్దని ఆదేశాలు అందడంతో భారత్‌లో ఇవి పని చేయడం అసాధ్యం. (నిషేధంపై టిక్‌టాక్ స్పందన)
మీ ఫోన్‌లోని ‘టిక్‌టాక్’కు ఏమవుతుందో తెలుసా?
Published Tue, Jun 30 2020 12:12 PM | Last Updated on Tue, Jun 30 2020 3:26 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment