92 శాతం ఆక్యుపెన్సీ రేటు సాధిస్తాం
న్యూఢిల్లీ
వచ్చే ఏడాదికల్లా రైల్వేలలో 92 శాతం ఆక్యుపెన్సీ రేషియోను సాధిస్తామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. రైల్వేల ప్రణాళికా వ్యయం రూ. 1.21 లక్షల కోట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈసారి మొత్తం 1.50 లక్షల కోట్లను ఎల్ఐసీ సంస్థ పెట్టుబడిగా పెడుతోందని చెప్పారు. రోజుకు 7 కిలోమీటర్ల చొప్పున ఈ ఏడాది 2800 కిలోమీటర్ల ట్రాక్‌ను బ్రాడ్‌గేజిగా మారుస్తామని తెలిపారు. తద్వారా మొత్తం 9 కోట్ల మ్యాన్‌డేస్ ఉపాధి కల్పన జరుగుతుందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మేకిన్ ఇండియాకు అనుగుణంగా రెండు లోకో ఫ్యాక్టరీలను నెలకొల్పుతామని, దీనివల్ల ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుందని ఆయన ప్రకటించారు. పారదర్శకతను మరింత పెంచేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నామన్నారు. ఐవీఆర్ఎస్ సిస్టంతో ప్రయాణికుల నుంచి రోజుకు లక్షకు పైగా కాల్స్ వస్తున్నాయని, మహిళలు, ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతోందని చెప్పారు. ఇప్పుడు రైల్వే మంత్రికి, సామాన్య ప్రయాణికుడికి ఏమాత్రం తేడా లేదని ఆయన అన్నారు.