సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి పదవిపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ శక్తివంతంగా దూసుకుపోతున్న సమయంలో.. ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ స్థానిక ఫలితాలతో యోగి ఆదిత్యనాథ్ జోష్‌లో ఉన్నారు. ఈ సమయంలో ఆయనను కలిసిన కొందరు నరేంద్ర మోదీ వారసుడు మీరేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి? ఆయన తరువాత ప్రధానమంత్రి మీరేనా? అని మీడియా వర్గాలు ప్రశ్నించాయి.
ఈ కఠిన ప్రశ్నకు యోగి ఆదిత్యనాథ్.. చాలా సులువుగా సమాధానం చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానికి లోక్‌సభలో అడుగు పెట్టిన తరువాత.. ‘‘నత్యహం కామయే రాజ్యం, నాస్వర్గం నా పునర్భావం !
కామయే దుఃఖతప్తానాం, ప్రాణినా మార్తినాశనం’’ అనే భగవద్గీత శ్లోకాన్ని చెప్పారు. అదే శ్లోకాన్ని నేడు అదే శ్లోకాన్ని ఆదిత్యనాథ్ మీడియా ముందు పునరుద్ఘాటించారు. నాకు పదవుల మీద ఎటువంటి ఆసక్తి, లక్ష్యం లేదని ఆదిత్యనాథ్ చెప్పారు. అదే సమయంలో నాడు మోదీ చెప్పిన ఈ శ్లోకాన్ని చెప్పడం ద్వారా ప్రధానమంత్రి పదవిపై ఆసక్తిని.. నర్మగర్భంగా చెప్పినట్లయింది.
మోదీ, ఆదిత్యనాథ్ చెప్పిన ఈ శ్లోకానికి భగవద్గీతలో అర్థం ఇలా ఉంది. ‘‘సర్వేశ్వరా.. నేను రాజ్యాన్ని, స్వర్గమును కోరను . పునర్జన్మరాహిత్యం నాకు అవసరం లేదు. అయితే దుఃఖంతో తపించిపోతున్న ప్రజలకు/ప్రాణులకు బాధానివారణ జరగాలని మాత్రమే కోరుకుంటున్నాను’’
Comments
Please login to add a commentAdd a comment