Prime ministerial candidate
-
PM Narendra Modi: ఇటు నేను.. అటు ఎవరు?
మహేంద్రగఢ్/పటియాలా: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు అధికారంలోకి రాకముందే ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని, ఆవు పాలు ఇవ్వకముందే నెయ్యి కోసం రగడ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు మారితే దేశం ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. తాను బతికి ఉన్నంతకాలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని చెప్పారు. దేశ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని స్పష్టంచేశారు. ఈ పోరాటంలో ఒకవైపు ప్రజల సేవకుడు మోదీ ఉన్నారని, మరోవైపు ఎవరున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. విపక్ష కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని పరోక్షంగా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కరడుగట్టిన కులతత్వం, మతతత్వం, బంధుప్రీతితో కూడిన ఇండియా కూటమిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం హరియాణాలోని మహేంద్రగఢ్, పంజాబ్‌లోని పటియాలాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి విపక్షాల కుట్రలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘రామ్ రామ్’ అని జపించినవారిని అరెస్టు చేస్తారని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ మన దేశాన్ని ముక్కలు చేసిందని, ఓటు బ్యాంక్‌ను సంతృప్తిపర్చడానికి రెండు ముస్లిం దేశాలను సృష్టించిందని విమర్శించారు. ఈసారి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని గుర్తచేశారు. మన ఆరాధన, విశ్వాసాన్ని కాంగ్రెస్ కించపరుస్తోందని దుయ్యబట్టారు. విభజించగా మిగిలిపోయిన భారతదేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లింలకే ఉందని విపక్ష నాయకులు అంటున్నారని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం ఇచి్చన రిజర్వేషన్లను సైతం కాజేయాలని చూస్తున్నారని తప్పుపట్టారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు రాత్రికి రాత్రే ఓబీసీ సరి్టఫికెట్లు ఇచ్చేశారని పేర్కొన్నారు. గత పన్నెండేళ్లలో ఇచి్చన ఆ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసిందని తెలిపారు. ఒకవేళ కోర్టు అడ్డుకోకపోతే ఓబీసీ అన్యాయం జరిగే మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ముస్లింలకు రిజర్వేషన్లకు కలి్పంచాలని కుట్ర పన్నుతున్న ప్రతిపక్షాల నిజస్వరూపం ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి ఓటమి తప్పదన్నారు. ఓటమికి బాధ్యులను చేసేందుకు ఒక బకరా కోసం ఆ కూటమిలో ఇప్పటినుంచే అన్వేషణ మొదలైందని పేర్కొన్నారు.పంజాబ్‌లో అరాచక పాలన పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దందా విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. పరిశ్రమలు పంజాబ్‌ను వదిలి వెళ్లిపోతున్నాయని, ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, డ్రగ్స్ మాఫియా, షూటర్ గ్యాంగ్‌లు చెలరేగిపోతున్నాయని ధ్వజమెత్తారు. పంజాబ్ మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారని, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీ దర్బార్‌లో హాజరు వేయించుకోవడంతోనే సమయం గడిపేస్తున్నారని ఆక్షేపించారు. అలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పారీ్టలు పంజాబ్‌లో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇది డ్రామా కాదా? అని మోదీ నిలదీశారు. -
Rishi Sunak: రిషి ఓటమి వెనుక కారణాలివే..
రెడీ ఫర్ రిషి అంటూ బ్రిటన్ ప్రధాని అభ్యర్థి ఎన్నికలో మొదట్లో దూకుడు చూపించిన రిషి సునాక్ ఎందుకు ఓటమి పాలయ్యారు? ఎంపీల మద్దతు పుష్కలంగా ఉన్నా టోరీ సభ్యుల అండదండలు ఎందుకు లభించలేదు? భారత్‌ను వలసరాజ్యంగా మార్చిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక భారతీయుడు పాలించే రోజు వస్తుందన్న ఆశలు ఎందుకు అడియాసలయ్యాయి? దీనిపై బ్రిటిష్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి... ► కోవిడ్–19 పార్టీ గేట్ కుంభకోణంలో ఇరుక్కొన్న ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రిషి వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం కన్జర్వేటివ్ పార్టీలో బలంగా ఏర్పడింది. రాజకీయ గురువని కూడా చూడకుండా జాన్సన్‌కు వ్యతిరేకంగా పని చేసి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించారని టోరీ సభ్యులు విశ్వసించారు. ఆర్థిక మంత్రి పదవికి రిషి రాజీనామా చేయడంతో ఇతర మంత్రులూ అదే బాట పట్టారు. వారికి మద్దతుగా 50 మంది ఎంపీలు కూడా రాజీనామా చేయడంతో ఒత్తిడి పెరిగి జాన్సన్ గద్దె దిగాల్సి వచ్చింది. దీన్ని నమ్మకద్రోహంగానే టోరి సభ్యులు చూశారు. ఆ వెంటనే రెడీ ఫర్ రిషి అంటూ పోటీకి దిగి దూకుడుగా ప్రచారానికి తెర తీయడంతో ప్రధాని పదవి కోసమే అంతా చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. బోరిస్ కూడా రిషికి వ్యతిరేకంగా పని చేశారు. ► ప్రతి మగవాడి విజయం వెనకా ఒక మహిళ ఉంటుందంటారు. కానీ రిషి పరాజయం వెనుక దురదృష్టవశాత్తూ ఆయన భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత ఉన్నారు. ఆమె ఎలిజెబెత్ రాణి కంటే సంపన్నురాలన్న ప్రచారముంది. అలాంటి వ్యక్తి పన్నులు ఎగ్గొట్టడానికి నాన్ డొమిసైల్ హోదాను అడ్డం పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా రిషికి ప్రతికూలంగా మారాయి. ► తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ ప్రకటించిన పన్ను రాయితీలను వ్యతిరేకించడం కూడా రిషి కొంప ముంచింది. వాటివల్ల ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుందన్న రిషి వాదనకు కాకలు తీరిన ఆర్థికవేత్తలు మద్దతిచ్చినా టోరీ సభ్యులు మాత్రం ట్రస్ తక్షణం ఉపశమన చర్యలకే జై కొట్టారు. ► రిషీ అమెరికా గ్రీన్ కార్డు వివాదం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. బ్రిటన్‌కు మకాం మార్చాక కూడా గ్రీన్ కార్డును ఆయన అట్టిపెట్టుకున్నారని, ఎప్పటికైనా అమెరికాకు వెళ్లిపోవడానికే ఈ పని చేశారని సోషల్ మిడియాలో బాగా ప్రచారమైంది. ఆర్థిక మంత్రి కాగానే గ్రీన్‌కార్డును వదులుకున్నానని రిషి వివ రణ ఇచ్చినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ► రిషి విలాసవంతమైన జీవితం కూడా ఆయనకు కాస్త చేటు చేసింది. ఆయన ఖరీదైన సూటు, బూటు, ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ఫొటో సెషన్లో ఖరీదైన మగ్గుతో ఫోటోలు దిగడం వంటివి పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. కరువు గుప్పిట్లో చిక్కిన బ్రిటన్‌లో గుక్కెడు నీళ్ల కోసం జనం విలవిల్లాడుతుంటే రిషీ యార్క్‌షైర్‌లోని తన కొత్తింట్లో 4 లక్షల పౌండ్లతో స్విమ్మింగ్ పూల్ నిర్మించడం వివాదాస్పదమైంది. ‘నా ఫ్రెండ్స్ అంతా ధనవంతులే. నా స్నేహితుల్లో సామాన్యులెవరూ లేరు’ అంటూ ఎప్పుడో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో రిషి అందరివాడు కాదన్న ప్రచారానికి బలం చేకూరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆయన కాలేరంటే.. మీరే కాస్త దృష్టి పెట్టొచ్చుగా సార్!
ఆయన కాలేరంటే.. మీరే కాస్త దృష్టి పెట్టొచ్చుగా సార్! -
మోదీ కాదు.. నితీష్ ప్రధాని అయితేనే
పట్నా : మరోసారి కేంద్రంలో ఎన్డీయే అధికారాన్ని చేపట్టాలంటే బిహార్ సీఎం నితీష్‌కుమార్ ప్రధాని పీఠం అధిరోహించాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ గులామ్ రసూల్ బలియావి అభిప్రాయపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయేకి మెజారిటీ రాదని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కాకుండా నితీష్‌వైపు మొగ్గు చూపితేనే ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందని అన్నారు. అదేవిధంగా.. బిహార్ ప్రజలు నితీష్ పనితీరు వల్లనే ఎన్డీయే పక్షాన నిలబడుతున్నారని.. ప్రధాని మోదీ వల్ల కాదని చెప్పుకొచ్చారు. రసూల్ వ్యాఖ్యలతో మరోసారి నితీష్ ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చలు మొదలయ్యాయి. అయితే, ఎమ్మెల్సీ కామెంట్లను నితీష్ కొట్టిపారేశారు. 40 ఎంపీ సీట్లున్న బిహార్‌లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 7 దశల్లో పోలింగ్ జరుతున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. జేడీయూ సీనియర్ నేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గత ఫిబ్రబరిలో నితీష్ ప్రధాని అభ్యర్థిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్డీయేకు సరిపడా మెజారిటీ వస్తుంది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అవడం ఖాయం. బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఎన్డీయేలో టాప్ లీడర్. గత పదేహేనేళ్లుగా సీఎంగా ఉన్న వ్యక్తికి ప్రజల్లో గొప్ప పాపులారిటీ ఉంటుంది. అయితే, నితీష్‌ను ప్రధాని రేసులోకి లాగటం మంచిది కాదు. ఒకవేళ ఎన్డీయేకు సంపూర్ణ మెజారీటీ రాకపోయినా.. నితీష్‌ను ప్రధాని రేసులో ఉన్నారని మాట్లాడటం అంత మంచిది కాదు’ అని అన్నారు. -
చిన్న పార్టీలకు పెద్ద సవాల్
సాక్షి, న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు ఎంకే స్టాలిన్ డిసెంబర్ 16వ తేదీన ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే రాహుల్ గాంధీని తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ లాంటి ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయిగానీ, తమిళనాడులో మాత్రం ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నాయి. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని అంగీకరిస్తున్నాయి. ‘విద్యుతలై చిరుతైగల్ గాట్చీ, మరుములార్చి ద్రావిడ మున్నేట్ర కళగం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాష్ట్ర స్థాయిలో డీఎంకే నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాయి. ఇక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇప్పటికే డీఎంకేతో పొత్తు పెట్టుకుంది. మరోపక్క కమల్ హాసన్ రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు, పుదుచ్ఛేరిలోని ఒక్క సీటుకు తాను కొత్తగా ఏర్పాటు చేసిన ‘మక్కల్ నీది మయామ్’ పోటీ చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా రానున్న 20 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కూడా తన పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. భావ సారూప్యత పార్టీలతో తమ పార్టీ పొత్తు పెట్టుకునేందుకు సుముఖంగా ఉందని ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు తెలిపారు. అయితే తాము ప్రధానంగా డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలను వ్యతిరేకిస్తున్నందున ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో ప్రస్తుతానికి స్పష్టత లేదని వారు అంటున్నారు. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం తిరుగుబాటు నాయకుడు టీటీవీ దినకరన్ గత మార్చి నెలలో ఏర్పాటు చేసిన ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం’ ఒంటిరిగా పోటీ చేయాలా, పొత్తులకు వెళ్లాలా ? అంశాన్ని ఇంకా తేల్చుకోలేదు. కమల్ హాసన్, దినకరన్‌లు తమ పార్టీలకు ఎన్నికల అనుభవం లేకపోయినా రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ మంచి ప్రభావాన్ని చూపగలవని భావిస్తున్నారు. ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలకు ఇప్పుడు జయలలిత, ఎం. కరుణానిధి లేకపోవడమే తమ పార్టీలకు లాభిస్తుందని వారు ఆశిస్తున్నారు. కేంద్రంలో ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు తాము కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్నామని, అది వచ్చే ఎన్నికల నాటికి ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బలమైన ప్రత్యామ్నాయం అవుతుందని డీఎంకే అధికార ప్రతినిధి తమిళన్ ప్రసన్న తెలిపారు. చిన్నా, చితక పార్టీలు తమతో కలిసి వచ్చినా, లేకపోయినా ఫర్వాలేదని ఆయన దీమా వ్యక్తం చేశారు. -
విపక్ష కూటమి తథ్యం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ‘వ్యూహాత్మక బలమైన కూటమి’ ఏర్పాటు తథ్యమని స్పష్టమైంది. ఇందులో భాగంగానే తెరవెనుక సంప్రదింపుల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. యూపీ, బిహార్లలో ఈ సంప్రదింపులు తుదిదశలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే.. ప్రధాని అభ్యర్థిపై ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని కూడా పార్టీ భావిస్తున్నట్లు వెల్లడించాయి. ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం ద్వారా కూటమిలో విభేదాలు పొడసూపే అవకాశముందన్న పార్టీ సీనియర్ల హెచ్చరికలతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పలుచోట్ల ఇబ్బందులున్నా స్వల్పకాలిక లక్ష్యాల కోసం దోస్తీ తప్పడంలేదు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌తో దోస్తీ విషయంలో పీసీసీలను కలుపుకుని వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ మదిలో ఏముంది? ‘బీజేపీని ఓడించటమే కాంగ్రెస్ సహా విపక్షాల ముందున్న ఏకైక లక్ష్యం. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తాం’ అని రాహుల్ సన్నిహిత నేత ఒకరు తెలిపారు. ‘మోదీ ప్రధాని కావాలంటే బీజేపీ సొంతగా 230–240 సీట్లు సంపాదించుకోవాలి. ఇంతకన్నా తక్కువ వస్తే.. ఎన్డీయే పక్షాల సాయంతో బీజేపీ అధికారంలోకి వచ్చినా మోదీ స్థానంలో వేరొకరు ప్రధాని అవుతారు. బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో ఈసారి విపక్ష కూటమి ఎక్కువ స్థానాలు గెలవడం ద్వారా మోదీ జోరును అడ్డుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రభుత్వం ఇంతవరకు సమాధానం ఇవ్వని రైతుల సమస్యలు, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, పేదరికం, ఆర్థిక వ్యవస్థ, అవినీతి కేసులు, రాఫెల్ ఒప్పందం తదితరాంశాలే ప్రధాన అస్త్రాలుగా బీజేపీని అడ్డుకుంటామన్నారు. సిద్ధాంతాల మధ్యే పోటీ బీజేపీతోపాటు ఆరెస్సెస్ భావజాలంపై ఐకమత్యంగా పోరాడేందుకు పలు విపక్షాల మధ్య విస్తృత ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. యూపీ, బిహార్‌లతోపాటు మహారాష్ట్రలను కీలకమైన రాష్ట్రాలుగా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. మహారాష్ట్రలో ఎన్సీపీతో మంచి దోస్తీ ఉంది. దీనికితోడు ఇటీవల శివసేన కూడా రాహుల్‌ను సమర్థిస్తూవస్తోంది. అయితే సిద్ధాంతపరమైన విభేదాల కారణంగానే శివసేన కు దూరంగా ఉండాలని పార్టీ యోచిస్తోంది. తెలంగాణలో ఇక్కడ ఒంటరిగానే వెళ్లాలని భావిస్తోంది. పీసీసీలకూ అవకాశం అయితే పొత్తుల విషయంలో పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకే పూర్తి అధికారాలు కట్టబెట్టినప్పటికీ.. ఆయా రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనుకుంటోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తమదే అధికారమని ఘంటాపథంగా చెబుతున్న కాంగ్రెస్.. సీఎం అభ్యర్థులను ప్రకటించకూడదని నిర్ణయించింది. ‘యూపీ, బిహార్, మహారాష్ట్రల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీని అడ్డుకోగలిగితే.. నరేంద్ర మోదీ పీఠాన్ని కదిలించినట్లే. 80 మంది ఎంపీలున్న యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో వ్యూహాత్మక అంగీకారం చాలా అవసరం’ అని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు తెలిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, హరియాణా సహా పలు ప్రాంతాల్లోనూ పార్టీ బలోపేతమైందన్నారు. -
దేశ ప్రధానిగా మాయావతి?
లక్నో : విదేశీ మూలాలున్న సోనియా గాంధీకి జన్మించడం వల్లన రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయ్యే అవకాశం లేదని బహుజన్ సమాజ్ పార్టీ నేత జై ప్రకాశ్ సింగ్ వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికలపై సమీక్షించేందుకు సోమవారం పార్టీ ఉన్నత స్థాయి సమావేశాన్ని లక్నోలో నిర్వహించింది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కంటే సోనియా గాంధీ పోలికలే రాహుల్‌కు ఎక్కువగా ఉన్నాయని అందుకే రాహుల్ దేశానికి ప్రధాని కాలేరని బీఎస్పీ పేర్కొంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాయావతికి ప్రకటించాలని బీఎస్పీ కోరింది. ఉత్తర ప్రదేశ్‌కి నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించి, విశేష అనుభవం కలిగిన బీఎస్పీ అధినేత్రి మాయావతి దేశానికి కాబోయే ప్రధాన మంత్రి అని బీఎస్సీ జాతీయ సమన్వయకర్త జై ప్రకాశ్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశంలో మత వైషమ్యాలు రెచ్చగొడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఏదుర్కొనే శక్తి కేవలం మాయావతికే ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడం కోసం మాయావతి తీవ్రంగా కృషి చేస్తున్నారని, కర్ణాటక వేదికగా విజయం సాధించారని పార్టీ సీనియర్ నేత వీర్ సింగ్ పేర్కొన్నారు. రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న రాహుల్ కంటే దేశ ప్రధాని అయ్యే అర్హతలు మాయావతికే ఉన్నాయన్నారు. అమె కేవలం దళితల పక్షపాతి కాదని దేశంలో అన్ని వర్గాల ప్రజల నుంచి మాయావతికి మద్దతు లభిస్తోందని తెలిపారు. బీఎస్పీ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ స్పందించారు. దేశానికి నాయకత్వం వహించాలని అనుకోవడంలో తప్పలేదని, ప్రస్తుతం లోక్‌సభలో ఒక్క సీటు కూడా లేని పార్టీ ప్రధానమంత్రి పదవి గురించి కలలు కంటోందని వ్యాఖ్యానించారు. బీఎస్పీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ స్పందించకపోవడం గమనార్హం. అవి ఆయన వ్యక్తిగత వ్యక్యలు.. రాహుల్ గాంధీని విదేశీ మూలాలున్న వ్యక్తిగా వర్ణించిన బీఎస్పీ వైస్ ప్రెసిడెంట్ జై ప్రకాశ్ సింగ్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. ఆ వ్యక్యలు ఆయన వ్యక్తిగతమైనవని పేర్కొన్నారు. -
ప్రధాని పదవిపై యోగి కన్ను!?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి పదవిపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ శక్తివంతంగా దూసుకుపోతున్న సమయంలో.. ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ స్థానిక ఫలితాలతో యోగి ఆదిత్యనాథ్ జోష్‌లో ఉన్నారు. ఈ సమయంలో ఆయనను కలిసిన కొందరు నరేంద్ర మోదీ వారసుడు మీరేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి? ఆయన తరువాత ప్రధానమంత్రి మీరేనా? అని మీడియా వర్గాలు ప్రశ్నించాయి. ఈ కఠిన ప్రశ్నకు యోగి ఆదిత్యనాథ్.. చాలా సులువుగా సమాధానం చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానికి లోక్‌సభలో అడుగు పెట్టిన తరువాత.. ‘‘నత్యహం కామయే రాజ్యం, నాస్వర్గం నా పునర్భావం ! కామయే దుఃఖతప్తానాం, ప్రాణినా మార్తినాశనం’’ అనే భగవద్గీత శ్లోకాన్ని చెప్పారు. అదే శ్లోకాన్ని నేడు అదే శ్లోకాన్ని ఆదిత్యనాథ్ మీడియా ముందు పునరుద్ఘాటించారు. నాకు పదవుల మీద ఎటువంటి ఆసక్తి, లక్ష్యం లేదని ఆదిత్యనాథ్ చెప్పారు. అదే సమయంలో నాడు మోదీ చెప్పిన ఈ శ్లోకాన్ని చెప్పడం ద్వారా ప్రధానమంత్రి పదవిపై ఆసక్తిని.. నర్మగర్భంగా చెప్పినట్లయింది. మోదీ, ఆదిత్యనాథ్ చెప్పిన ఈ శ్లోకానికి భగవద్గీతలో అర్థం ఇలా ఉంది. ‘‘సర్వేశ్వరా.. నేను రాజ్యాన్ని, స్వర్గమును కోరను . పునర్జన్మరాహిత్యం నాకు అవసరం లేదు. అయితే దుఃఖంతో తపించిపోతున్న ప్రజలకు/ప్రాణులకు బాధానివారణ జరగాలని మాత్రమే కోరుకుంటున్నాను’’ -
మోడీ ప్రధాని అయితే అమెరికా ఆపగలదా?
దేవయానీ ఖోబ్రగడే విషయంలో తల బొప్పి కట్టించుకున్న అగ్రరాజ్యం అమెరికా ముందు ఇప్పుడు మరో పెద్ద బండ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న నరేంద్రమోడీ నిజంగానే రేపు ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి అయితే.. ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని టైమ్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. పనిమనిషి వీసా కేసులో అమెరికాలో తీవ్ర అవమానానికి గురైన తర్వాత భారతీయ దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగడే భారతదేశానికి తిరిగి వెళ్లారని ఆ పత్రిక తన తాజా సంచికలో రాసింది. అయితే, రెండు దేశాల మధ్య సంబంధాలు అంత త్వరగా మెరుగుపడతాయని తాము అనుకోవట్లేదని, నరేంద్ర మోడీకి అమెరికా వీసా నిరాకరించడంతో, రేపు ఆయన ప్రధానమంత్రి అయితే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని తెలిపింది. ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా రాసింది. నరేంద్ర మోడీ 'అమెరికాకు ఏమాత్రం ఇష్టంలేని వ్యక్తి' అని, ఆయనపై హింసాత్మక సంఘటనలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినా, భారతీయ కోర్టులేవీ ఆయనను బాధ్యుడిగా పేర్కొనలేదని 'టైమ్' పత్రిక తెలిపింది. మతస్వేచ్ఛకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ భంగం కలిగించేలా ప్రవర్తించిన నాయకులకు అమెరికన్ చట్టాల ప్రకారం వీసా ఇవ్వబోమంటూ అమెరికా విదేశాంగ శాఖ 2005లోనే నరేంద్ర మోడీకి తమదేశంలో ప్రవేశించడానికి వీల్లేకుండా వీసా నిరాకరించింది. అప్పటికి మోడీ జాతీయస్థాయి నాయకుడు కారని, కానీ ఇప్పుడు మాత్రం ఆయన ప్రధాని అయితే.. అంతటి నాయకుడిని అమెరికా నిరాకరించగలదా అని ఆ పత్రిక సూటిగా ప్రశ్నించింది. మోడీ విషయంలో అమెరికా విధాన నిర్ణేతలు కూడా చీలిపోయారని, కొంతమంది మోడీ రాకను వ్యతిరేకిస్తున్నా.. రియలిస్టులు, అమెరికా వ్యాపారవేత్తలు మాత్రం ఆయన రావాలనే కోరుకుంటున్నారని, విదేశీ పెట్టుబడులకు ఆయన అనుకూలంగా ఉంటారన్న విషయాన్ని వారు గ్రహించారని టైమ్ పేర్కొంది. -
రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి
వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించాలని ఆ పార్టీ నాయకులు స్వరం పెంచుతున్నారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా తాజాగా ఈ జాబితాలో చేరారు. ప్రధాని మంత్రి పదవికి రాహుల్ బలమైన అభ్యర్థి అవుతారని హుడా అభిప్రాయపడ్డారు. కాగా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ప్రకటించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. రాహుల్ ప్రధాని కావాలని కాంగ్రెస్‌లో చాలామంది నాయకులు కోరుకుంటున్నారని హుడా అన్నారు. ఇదిలావుండగా, లోక్‌సభ ఎన్నికలకు ముందే మన్మోహన్ సింగ్ స్థానంలో రాహుల్‌ను ప్రధానిగా నియమించనున్నారని జాతీయ మీడియాలో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హుడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
రాహుల్ పట్టానికి రంగం సిద్ధం
వచ్చేనెల 17న ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం రాహుల్‌గాంధీని కాంగ్రెస్ తన ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబోతోందా? ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చేనెల 17న ఏఐసీసీ సమావేశం జరగబోతోంది. వెయ్యి మంది పార్టీ ప్రతినిధులు తరలిరానున్నారు. ఈ సందర్భంగానే రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలను చర్చించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించినా రాహుల్‌కు పట్టం కోసమే భేటీని ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతినడం తెలిసిందే. ఫలితాల తర్వాత రాహుల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడిన సోనియాగాంధీ.. సరైన సమయంలో పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ఓవైపు బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి మోడీ దూసుకుపోతుంటే కాంగ్రెస్ తన అభ్యర్థి విషయంలో తాత్సారం చేయడం పనికిరాదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నాయి. తాము వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోబోమని డీఎంకే ప్రకటించగా.. ప్రజలు బలహీనమైన నాయకత్వాన్ని కోరుకోవడం లేదంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని అభ్యర్థి విషయంలో ఇంకా ఆలస్యం చేయడం సరికాదని కాంగ్రెస్ భావిస్తోంది. -
హస్తిన చేరుకోనున్న మోడీ
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరూ భావిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ.. అత్యంత కీలకమైన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కోసం ఢిల్లీకి చేరుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గాంధీనగర్ నుంచి ఢిల్లీకి బయల్దేరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఏర్పాటుచేయనున్నారు. అయితే, ఈ సమావేశం జరుగుతున్న విషయం తనకు తెలియదని పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలోనే మోడీ ప్రధాని అభ్యర్థిత్వం గురించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ, మరికొంతరు నాయకులు కూడా మోడీ అభ్యర్థిత్వంపై వ్యతిరేకతతో ఉన్న విషయం తెలిసిందే. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో జరగనుంది.