రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి | Rahul Gandhi should be prime ministerial candidate, says Hooda | Sakshi
Sakshi News home page

రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి

Published Wed, Jan 1 2014 9:13 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి - Sakshi

రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి

వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించాలని ఆ పార్టీ నాయకులు స్వరం పెంచుతున్నారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా తాజాగా ఈ జాబితాలో చేరారు.  ప్రధాని మంత్రి పదవికి రాహుల్ బలమైన అభ్యర్థి అవుతారని హుడా అభిప్రాయపడ్డారు. కాగా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ను ప్రకటించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.

రాహుల్ ప్రధాని కావాలని కాంగ్రెస్లో చాలామంది నాయకులు కోరుకుంటున్నారని హుడా అన్నారు. ఇదిలావుండగా, లోక్సభ ఎన్నికలకు ముందే మన్మోహన్ సింగ్ స్థానంలో రాహుల్ను ప్రధానిగా నియమించనున్నారని జాతీయ మీడియాలో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హుడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement