
పట్నా: సరిహద్దుల్లో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో అమరులైన జవాన్ల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. వారి పిల్లలు, తల్లిదండ్రులూ శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డల్ని దేశం కోసం పెంచామని, గర్వంగా దేశం కోసం ప్రాణాలొదిలారని జవాన్ల తల్లిదండ్రులు చెప్తున్నారు. తమ పిల్లలు అమరులవడంపట్ల.. తమకేం బాధ లేదని చెబుతున్నప్పటకీ లోలోపల కుమిలిపోతున్నారు. అయితే, దేశ సేవకై తన ఇద్దరు మనుమలను సైతం భారత సైన్యంలోకి పంపుతానని బిహార్‌కు చెందిన జవాన్ కుందన్‌కుమార్ తండ్రి పేర్కొన్నారు.
(చదవండి: చైనా కుయుక్తులకు సాక్ష్యమీ ఫొటోలు!)
‘నా కుమారుడు దేశం కోసం ప్రాణాలు వదిలాడు.. నాకు ఇద్దరు మనుమలు ఉన్నారు.. వాళ్లను కూడా సైనికులుగా తయారు చేస్తా.. బోర్డర్‌కు పంపుతా’ అని భారత్, చైనా ఘర్షణలో అమరుడైన జవాన్ కుందన్‌కుమార్ తండ్రి ఆవేదన భరితంగా వెల్లడించారు. కాగా, తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. మరోవైపు 43 మంది చైనా సైనికులు భారత సైనికుల దాడిలో చనిపోయినట్టు ఆ దేశ మీడియా ప్రకటించింది.
(చదవండి: చైనా సైనికుల పనే..)
Comments
Please login to add a commentAdd a comment