తండ్రితో వెళ్తున్న బాలుడు... ఊడి పడిన కిటికీ | Window frame falls from building, kills 8-year-old boy | Sakshi
Sakshi News home page

తండ్రితో వెళ్తున్న బాలుడు... ఊడి పడిన కిటికీ

Published Fri, Sep 5 2014 9:58 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

తండ్రితో వెళ్తున్న బాలుడు... ఊడి పడిన కిటికీ - Sakshi

తండ్రితో వెళ్తున్న బాలుడు... ఊడి పడిన కిటికీ

న్యూఢిల్లీ: కొత్త బట్టలు కొనుక్కునేందుకు ఎనిమిదేళ్ల కుమారుడు ముసా అలీ తన తండ్రితోపాటు సైకిల్పై బయలుదేరాడు. ఆ క్రమంలో వారు బజారుకు వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో నిర్మాణంలో ఉన్న భవనం కిటికీ ఊడి... ముసా అలీపై పడింది. దాంతో అలీ రక్తపు మడుగులో పడిపోయాడు. దాంతో తండ్రి అలీని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. వైద్యులు అలీకి పరీక్షలు నిర్వహించి మృతి చెందాడని తెలిపారు. దీంతో ఆ తండ్రి హతాశుడయ్యాడు.

ఈ హృదయ విదారకమైన ఘటన మధ్య ఢిల్లీ చాందినీ మహల్ ప్రాంతంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. అలీ మృతదేహాన్ని వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం అలీ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. నిర్మాణంలో ఉన్న భవనం యజమాని నిర్లక్ష్యంగా వ్యవహారించినట్లు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement