Window frame
-
240 ప్రాణాలు..15 వేల అడుగులు
న్యూఢిల్లీ: ఓ విమానం.. 240 మంది ప్రయాణికులు.. 15 వేల అడుగుల ఎత్తు.. ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఊడిపడిన విమానం కిటికీ ప్యానెల్.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. తీవ్ర గందరగోళం.. ఆందోళన.. 12 నిమిషాలపాటు నరకం. ఎట్టకేలకు సురక్షితంగా గమ్యస్థానానికి చేరిన విమానం. ఈనెల 19న అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఎయిరిండియా విమానంలో నెలకొన్న పరిస్థితి ఇది. విమానం 15 వేల అడుగుల ఎత్తులో ఉండగా తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో విమానం తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అదే సమయంలో కిటికీ ప్యానెల్ ఊడిపడటంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. విమానంలో, తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారు వేరే విమానాల్లో వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎయిరిండియాతోపాటు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టొరేట్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదాల దర్యాప్తు బోర్డు (ఏఏఐబీ) విచారణ జరుపుతున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి 50 సెకెన్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఊడిపడిన కిటికీ ప్యానెల్‌ను తిరిగి బిగించేందుకు ఎయిర్ హోస్టెస్ ప్రయత్నిస్తుండటం అందులో కనిపించింది. -
వైరల్ : గాల్లోనే తెరుచుకున్న విమానం కిటికీ
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం(ఏప్రిల్ 19) అమృత్సర్ నుంచి ఢిల్లీకి 240 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురయింది. ఒక్కసారిగా విమాన కిటికీ తెరుచుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం 15వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా విమాన కిటికీ ఒక్కసారిగా తెరుచుకుందని విమానయాన అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స అందించామన్నారు. విమానంలో పది నిమిషాల పాటు ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. ఎయిర్‌హోస్టెస్ కిటికీని యథాస్థానంలో ఉంచేందుకు ప్రయత్నించినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని డీజీసీఏ అధికారులు తెలిపారు. అయితే ఎయిర్ ఇండియా దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
విమానం గాల్లో ఉండగా తెరుచుకున్న కిటికి
-
తండ్రితో వెళ్తున్న బాలుడు... ఊడి పడిన కిటికీ
న్యూఢిల్లీ: కొత్త బట్టలు కొనుక్కునేందుకు ఎనిమిదేళ్ల కుమారుడు ముసా అలీ తన తండ్రితోపాటు సైకిల్‌పై బయలుదేరాడు. ఆ క్రమంలో వారు బజారుకు వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో నిర్మాణంలో ఉన్న భవనం కిటికీ ఊడి... ముసా అలీపై పడింది. దాంతో అలీ రక్తపు మడుగులో పడిపోయాడు. దాంతో తండ్రి అలీని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. వైద్యులు అలీకి పరీక్షలు నిర్వహించి మృతి చెందాడని తెలిపారు. దీంతో ఆ తండ్రి హతాశుడయ్యాడు. ఈ హృదయ విదారకమైన ఘటన మధ్య ఢిల్లీ చాందినీ మహల్ ప్రాంతంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. అలీ మృతదేహాన్ని వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం అలీ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. నిర్మాణంలో ఉన్న భవనం యజమాని నిర్లక్ష్యంగా వ్యవహారించినట్లు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.