నడుస్తున్న కారులో యువతిపై.. | Woman Allegedly Kidnapped, Gang Raped By 4 Men In A Car Near Kolkata | Sakshi
Sakshi News home page

నడుస్తున్న కారులో యువతిపై..

Published Mon, May 30 2016 6:59 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

నడుస్తున్న కారులో యువతిపై.. - Sakshi

నడుస్తున్న కారులో యువతిపై..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి.. నడుస్తున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కోల్‌కతా శివార్లలోని సాల్ట్‌ లేక్‌ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఓ బస్టాప్‌ సమీపంలో స్పృహతప్పి పడిపోయిన ఉన్న బాధితురాలిని సోమవారం ఉదయం స్థానికులు గుర్తించారు.

ప్రస్తుతం బాధితురాలని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement