లైంగికదాడికి యత్నించి.. రైల్లో నుంచి తోసి..
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో కొందరు దుండగులు రైలులో రెచ్చిపోయారు. ఓ 32 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా అడ్డుకున్న ప్రతిఘటించిన ఆమెను రైలులో నుంచి తోసేశారు. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. నుదుటిపైన, భూజాలకు బలంగా తగిలాయి.
దీంతో ట్రాక్ పక్కనే స్పృహకోల్పోయి దాదాపు ఏడుగంటలపాటు అలాగే పడి ఉంది. అనంతరం కొందరు గ్రామస్తులు గమనించి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు బరాసత్‌లో జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఆమె ప్రస్తుత పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే ఆమె కాళ్లకు సర్జరీలు చేశారు. సీటీ స్కాన్ కూడా చేశారు. సెల్దా-హస్నాబాద్ మధ్యలో ఉన్న హరోవా స్టేషన్‌కు సమీపంలోని లేడిస్ కంపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.