
సాక్షి, ఖమ్మం: ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. రైలు ఎక్కుతుండగా ఓ మహిళ జారిపడింది. ట్రైన్, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కుపోయింది. మధిరకు చెందిన రైల్వే ఉద్యోగి నాగేశ్వరరావు అతని భార్య కల్యాణి ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చారు. ఆసుపత్రిలో చూపించుకున్న అనంతరం తిరిగి మధిర వెళ్ళడానికి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
ఇంటర్ సిటీ ట్రైన్ రావడముతో ముందు నాగేశ్వర రావు ఎక్కాడు. వెనుకనే భార్య కల్యాణి కూడా ట్రైన్ ఎక్కుతుండగా ఒక్కసారిగా రైలు కదిలింది. దీంతో మహిళ ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్క పోవడంతో ఏడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. దీనిని గమనించిన రైల్వే సిబ్బంది అతి కష్టం మీద మహిళను బయటకు తీసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment