భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్
ముజాఫర్ నగర్: అత్యాచార రాజధానిగా వార్తలకెక్కిన ఉత్తర ప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ జంట బైక్ పై వెళుతున్న క్రమంలో నలుగురు యువకులు అడ్డగించి తొలుత వారిపై దాడికి దిగారు. అనంతరం భర్తను తాళ్లతో చెట్టుకు కట్టేసి భార్య((23)పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. గత రాత్రి ఓ కార్యక్రమానికి సంబంధించి షహనాపూర్ కు హాజరైన ఒక జంట తిరిగి షమ్లీకి వెళుతుండగా ఆ కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
భర్తను చెట్టుకు కట్టేసిన ఆ దుండగులు భార్యను దగ్గర్లో ఉన్న తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. తరువాత వారి వద్ద ఉన్న నగదును కూడా అపహరించుకు పోయినట్లు సీనియర్ పోలీస్ సూపరిండెంట్ నితీష్ తివారీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.