మహిళా ఐఏఎస్‌ అధికారికి ఐదేళ్ల జైలు | woman ias officer sent to jail for 5years | Sakshi
Sakshi News home page

మహిళా ఐఏఎస్‌ అధికారికి ఐదేళ్ల జైలు

Published Sun, Sep 29 2013 1:17 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

woman ias officer sent to jail for 5years

మాండ్లా (మధ్యప్రదేశ్‌): అవినీతికి పాల్పడినందుకుగానూ మధ్యప్రదేశ్‌లో ఒక మహిళా ఐఏఎస్‌ అధికారికి స్థానిక కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధించింది. 1999-2000లో శశీ కర్నవత్‌ మాండ్లా జిల్లా పంచాయతీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా ఉన్న సమయంలో రిజిస్టర్ల ప్రింటింగ్‌, కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగాయి. ఎటువంటి టెండర్లు పిలవకుండా ప్రింటింగ్‌, కొనుగోలు జరపడంతో రూ.34 లక్షలు దుర్వినియోగమయ్యాయి.

 

ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిపిన మాండ్లా కోర్టు కర్నవత్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement