మహిళా ఐఏఎస్ అధికారికి ఐదేళ్ల జైలు
మాండ్లా (మధ్యప్రదేశ్): అవినీతికి పాల్పడినందుకుగానూ మధ్యప్రదేశ్లో ఒక మహిళా ఐఏఎస్ అధికారికి స్థానిక కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధించింది. 1999-2000లో శశీ కర్నవత్ మాండ్లా జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా ఉన్న సమయంలో రిజిస్టర్ల ప్రింటింగ్, కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగాయి. ఎటువంటి టెండర్లు పిలవకుండా ప్రింటింగ్, కొనుగోలు జరపడంతో రూ.34 లక్షలు దుర్వినియోగమయ్యాయి.
ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిపిన మాండ్లా కోర్టు కర్నవత్కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.