ప్రియుడితో కలసి భర్త గొంతు కోసింది... | Woman kills her husband and elopes with paramour | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలసి భర్త గొంతు కోసింది...

Published Fri, Jan 22 2016 4:12 PM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

ప్రియుడితో కలసి భర్త గొంతు కోసింది... - Sakshi

ప్రియుడితో కలసి భర్త గొంతు కోసింది...

భోపాల్: ప్రియుడితో కలిసి అగ్ని సాక్షిగా తాళికట్టిన భర్తను పాశవికంగా గొంతుకోసి ఓ ఇల్లాలు కడతేర్చింది. అయితే, మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జీ సునీల్ ఖేమారియా కథనం ప్రకారం... అశోక్ సింగ్(34), తన భార్య అంజనా, ముగ్గురు పిల్లలతో కలిసి భైంద్ లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి వీరి ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన అశోక్ తల్లి ఉషా కొత్వాలీ పోలీసులను ఆశ్రయించింది. గత ఏడు రోజుల నుంచి కుమారుడి కుటుంబం వివరాలు తెలియడం లేదని, వారి ఇంటికి తాళం ఉందని గురువారం ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొంది.

అశోక్ ఇంటికి చేరుకున్న పోలీసులు తాళాలు బద్దలుకొట్టి లోనికి వెళ్లారు. అతడ౮ రక్తపు మడుగులో పడిఉండటాన్ని గమనించారు.  ఓ పదునైన వస్తువుతో అశోక్ గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య అంజనా, పిల్లల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. కాగా అశోక్ భార్యకు అశీష్ చౌదరి అనే వ్యక్తితో  వివాహేతర సంబంధాలున్నాయని, తమకు అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసి ఉండొచ్చునని అనుమానిస్తున్నారు. అశోక్ తల్లి చెప్పిన వివరాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ప్రియుడు అశీష్ చౌదరి సహా ముగ్గురు పిల్లలతో కలిసి అంజనా పరారయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు సునీల్ ఖేమారియా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement