
నోయిడా : ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ తనను ఐదేళ్లుగా అత్యాచారం చేశారంటూ నోయిడా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమెకు 12 ఏళ్లు ఉన్నప్పుడు పక్కింట్లో ఉండే ముగ్గురు అన్నదమ్ములు, వారి ఇంటికి వచ్చే వారి స్నేహితులు దాదాపు ఐదేళ్లపాటు తనపై అత్యాచారం జరిపారని ఆమె పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఖండించారని పోలీసులు తెలిపారు. అయినా ఆమె తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment