ఉపాధిహామీ కూలీలకు కనీస వేతనచట్టం: సుప్రీం
న్యూఢిల్లీ: కేంద్రం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద కూలీలకు చెల్లించే వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ఆదేశించింది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద వ్యవసాయ కార్మికులకు ఇచ్చే వేతనాలు వివిధరాష్ట్రాల్లో అమలులో ఉన్న కనీస వేతనాల చట్టం కన్నా తక్కువగా ఉండడానికి వీలులేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈమేరకు జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేలతో కూడిన డివిజన్‌బెంచ్ ఆదేశాలు జారీచేసింది. కూలీలకు చెల్లించే మొత్తం కనీస వేతనచట్టంకంటే తక్కువగా ఉండరాదని కర్ణాటక హైకోర్టు 2011 సెప్టెంబర్ 23న తీర్పు చెప్పింది. దానిని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థించారు.