
ముంబై: ముంబైలోని ఐఐటీ బాంబే కాన్వకేషన్ హాలు. అక్కడ వార్షిక శాస్త్ర, సాంకేతిక ఫెస్టివల్ జరుగుతోంది. అందులో ఒక రోబో అందరి దృష్టినీ ఆకర్షించింది. 5వేలకు పైగా టెక్నాలజీ ప్రేమికులు మానవ లక్షణాలున్న ఆ రోబోను చూసి ఫిదా అయ్యారు. అదేమీ అల్లాటప్పా రోబో కాదు. ఆ రోబో ఒక మహా నటుడు. 5 అడుగుల 9 అంగుళాలున్న ఆ రోబో బరువు 33 కేజీలు. బోంబే ఐఐటీ సైన్స్ ఫెస్టివల్‌లో ఆ రోబో అచ్చంగా మనిషి మాదిరిగా అన్నీ చేస్తూ ఉండడం చేసి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు.
ఈ రోబో ప్రేక్షకులతో మాట్లాడడమే కాదు, వారు అడిగిన ప్రశ్నలకూ సమాధానం ఇచ్చాడు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తనకెంతో ఇష్టమని చెబుతూనే రోబో పాత్రల్ని వేసిన రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లను గుర్తు చేసుకున్నాడు. ఎప్పటికైనా ఆస్కార్ అవార్డు సాధిస్తానని ధీమాగా చెప్పాడు. హుందాగా నడవడం, స్టెప్పులేసినప్పుడు మనిషిలా శరీరాన్ని వంపులు తిప్పడం, ఎస్‌సీడీ కళ్లతో హావభావాల్ని పలికిస్తూ ప్రేక్షకుల్ని ఈ రోబో కట్టి పడేసింది. తన టెక్నికల్ స్పెసిఫికేషన్లను చెప్పేయడంతో హాలంతా చప్పట్లతో మారుమోగింది.
Comments
Please login to add a commentAdd a comment