convocation day
-
తెలియనితనంలో ఉండే బలం ప్రతిఘటనే!
నోరు మూయించి పెత్తనం చేసే పాలకులు నోరు మూసుకుని బతికే ΄పౌరులు చరిత్ర నిండా ఉంటారు. కాని నోరు మూసుకొని ఉండటం చేతగాక అన్యాయాన్ని చూస్తూ ఉండలేక గొంతెత్తి గర్జించేవాళ్లు చరిత్రలో నిలబడిపోతారు. మన దేశ మూలాలున్న హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని శ్రుతి కుమార్– ఆ ప్రతిష్టాత్మక ్రపాంగణంలో గాజా మీద ఇజ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా నోరు విప్పింది. ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. వెనుకంజ వేయని మానవత్వం చాటిన శ్రుతి కుమార్ పరిచయం, నేపథ్యం.హార్వర్డ్ యూనివర్సిటీ తన విద్యార్థుల గురించి సరిగ్గా అధ్యయనం చేసినట్టు లేదు. చేసి ఉంటే బహుశా శ్రుతి కుమార్‌కు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండేది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ సెరెమొనీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు విశేషంగా హాజరయ్యి వేదిక మీద పట్టా అందుకుంటున్న తమ పిల్లలను హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తారు. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రతి ఏటా ఈ సెర్మనీలో పట్టా పొందుతున్న ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రసంగించే అవకాశం ఇస్తారు. ఈసారి ప్రసంగం చేసే అవకాశం శ్రుతి కుమార్‌కు వచ్చింది. అక్కడే ఆమెకు గొంతెత్తే అవకాశం లభించింది.నిరసనల నేపథ్యంఅక్టోబర్ 7, 2023న హమాస్ సంస్థ ఇజ్రాయిల్ మీద దాడి చేసి 1400 ఇజ్రాయిలీల మరణానికి కారణం కావడంతో బదులు తీర్చుకోవడానికి రంగంలో దిగిన ఇజ్రాయిల్ నేటికీ ఆగని బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఇప్పటికి 35,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా వీరిలో కనీసం ఇరవై వేల మంది స్త్రీలు, పసి పిల్లలు. ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు మొదలైనా ఇజ్రాయిల్ మరింత దుర్మార్గంగా గాజాలోని ఆస్పత్రుల పై, స్కూళ్లపై దాడులు చేస్తుండటంతో ఇక విద్యార్థులు ఆగలేకపోయారు. ఏప్రిల్ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలు ‘యాంటీ ఇజ్రాయిల్’ నిరసనలతో హోరెత్తాయి. యూనివర్సిటీలు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పటికి 900 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. వారిలో ఒక భారతీయ విద్యార్థిని కూడా ఉంది. అమెరికా యూనివర్సిటీలు తమ దగ్గర పోగయ్యే ఫండ్స్‌ను ఇజ్రాయిల్‌కు వంత పాడే బహుళ జాతి వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని, ఆ డబ్బును వెనక్కు తీసుకోవాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్. అంతే కాదు టెల్ అవివ్ (ఇజ్రాయిల్) యూనివర్సిటీతో కోర్సుల ఆదాన ప్రదానాలు చేసుకోవడం బంద్ చేయాలని కూడా డిమాండ్. ఏప్రిల్ 18న ఇదే విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీలో భారీ నిరసన జరిగింది. విద్యార్థులు ఏకంగా మూడు చోట్ల పాలస్తీనా జెండాను ఎగురవేశారు. దాంతో యూనివర్సిటీ కన్నెర్ర చేసి ‘వయొలేషన్ ఆఫ్ యూనివర్సిటీ పాలసీ’ కింద 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా శిక్షించింది. అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రుతి కుమార్ ఈ అంశం మీద నిరసన వ్యక్తం చేసేందుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీని ఎంచుకుంది.ఆమె ఒక టోర్నడోబీభత్సమైన పిడుగుపాట్లకూ, టోర్నడోలకు పేరు పెట్టిన నెబ్రాస్కా (అమెరికా) రాష్ట్రంలో పుట్టిన కన్నడ మూలాలున్న అమ్మాయి శృతి కుమార్. అక్కడ విస్తారంగా సాగు చేసే జొన్నరైతుకు పెద్ద కూతురు ఆమె. చదువుతో పాటు ఆట, పాట, మాటలో కూడా ఆసక్తి చూపింది. మంచి వక్త. ‘నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ –2019’లో పాల్గొని ఐదవ ర్యాంకులో నిలిచింది. 2020లో ‘వాయిస్ ఆఫ్ డెమొక్రసీ’ పోటీలో మొదటి విజేతగా నిలిచి 30 వేల డాలర్లు గెలుచుకుంది. అంతేకాదు తన చదువుకు స్పాన్సర్ని కూడా. యోగాలో దిట్ట. ముందు నుంచి అన్యాయాల, అపసవ్యతల మీద వ్యతిరేకత తెలిపే అలవాటున్న శ్రుతి కుమార్‌కు హార్వర్డ్ అవకాశం ఇవ్వడంతో ఆ యూనివర్సిటీనే హెచ్చరించి ఖంగు తినిపించింది.తెలియనితనపు బలంహార్వర్డ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో శ్రుతి కుమార్ తన ప్రసంగానికి పెట్టుకున్న పేరు ‘తెలియనితనంలో ఉండే బలం’. ఆమె తన ప్రసంగం చేస్తూ ‘ప్రపంచంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ తెలిసి నోరు మెదపని వారి కంటే ఏమీ తెలియకనే అది అన్యాయమనే కేవలం గ్రహింపుతో బరిలోకి దిగి ఎదిరించే నాలాంటి విద్యార్థులకు ఉండే బలం పెద్దది’ అని అంది. ‘పసిపిల్లల వంటి అమాయకత్వంతో కొత్త జన్మెత్తి అన్యాయాలను ప్రతిఘటించడానికి ముందుకు రావాలనే’ అర్థంలో శ్రుతి కుమార్ మాట్లాడి హర్షధ్వానాలు అందుకుంది. ‘మన విశ్వవిద్యాలయ ్రపాంగణంలో భావ ప్రకటనా స్వేచ్చపట్ల వ్యక్తమైన అసహనాన్ని చూసి నేను చాలా నిరాశకు గురవుతున్నాను. 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా ఆపారు. దీనిని వ్యతిరేకిస్తూ పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదు వందల మంది అధ్యాపకులం ఖండించాం. విశ్వవిద్యాలయ యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. అయినా సరే వినలేదు. హార్వర్డ్, మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్, మా మాటలు వింటున్నావా?’ అని శ్రుతి గర్జించింది. ‘ఇప్పుడు గాజాలో జరుగుతున్న ఘటనల మీద క్యాంపస్ మొత్తంగా దుఃఖం, అనిశ్చితి, అశాంతి చూస్తున్నాను. సరిగ్గా ఇప్పుడే ఇటువంటి క్షణంలోనే తెలియనితనపు శక్తి కీలకమైన దవుతుంది’ అందామె.పర్యవసానాలను గురించి వెరవక శ్రుతి ఈ ప్రసంగం చేసింది. యూనివర్సిటీకి తాను ఇచ్చిన ప్రసంగం పేజీలలో లేనిదాన్ని మధ్యలో ఇమిడ్చి ధైర్యంగా మాట్లాడింది. నిజం చె΄్పాలంటే శ్రుతి అన్ని దేశాల విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిస్తోంది. అన్నీ తెలిసి ఊరికే ఉండటం కన్నా, ఏమీ తెలియకనే ‘అన్యాయం’ అనిపించినప్పుడు వెంటనే గొంతెత్తాలని సందేశం ఇస్తోంది.ఆమె ప్రసంగంలో కొంత‘నేడు ఈ ఉత్సవం మనకు తెలిసినదాని కోసం చేస్తున్నారు. మనకు ఏం తెలుసో దానిని ప్రశంసిస్తున్నారు. కాని తెలియనితనపు బలం ఒకటుంటుంది. నేనిక్కడికి (హార్వర్డ్) వచ్చేవరకూ ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ అనే పాఠ్యాంశం ఉన్నదనేదే నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆ శాఖ నుంచి నేను గ్రాడ్యుయేట్ నయ్యాను. చరిత్రంటే మనకు తెలిసిన కథల గురించి ఎంత చదవాలో... తెలియని కథల గురించి కూడా అంత చదవాలని ఇక్కడే తెలుసుకున్నాను’(మరికొంతసేపు మాట్లాడి తన దుస్తులలో నుంచి చిన్న కాగితం తీసి ప్రధాన ప్రసంగానికి విరామం ఇచ్చి ఇలా మాట్లాడింది) ‘నా నాల్గవ సంవత్సరం చదువులో యూనివర్సిటీలో మా భావ ప్రకటనా స్వేచ్ఛ, మా నిరసన ప్రదర్శనా స్వేచ్ఛ నేరాలుగా మారిపోయాయి. నేనిక్కడ ఇవాళ మీ ముందు నిలబడి నా సహ విద్యార్థులైన పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తు చేసుకోవాలి. ఆ పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్లు ఇవాళ పట్టభద్రులు కాలేకపోతున్నారు. మన విశ్వవిద్యాలయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల వ్యక్తమైన అసహనం ఫలితం ఇది. దీనికి నేను చాలా నిరాశæ చెందుతున్నాను. పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదువందల మంది అధ్యాపకులం ఈ అసహనాన్ని ఖండించాం. యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. విద్యార్థులు మాట్లాడినా అధ్యాపకులు మాట్లాడినా అదంతా ఈ క్యాంపస్‌లో స్వేచ్ఛ గురించే. ΄పౌరహక్కుల గురించే. హార్వర్డ్... మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్... మా మాటలు వింటున్నావా?’(అని మళ్లీ ప్రధాన ఉపన్యాసంలోకి వచ్చింది) ‘ఒక జాతి అయిన కారణాన తనను లక్ష్యంగా చేసి దాడులకు గురి చేయడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. హింసా, మృత్యువూ మన కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. మనకు తెలియవలసిన అవసరం కూడా లేదు. మనం కూడగట్టి మాట్లాడటం అనేది మనకు తెలిసి ఉన్న విషయాల గురించే కానక్కరలేదు. మనకు తెలియనిదాని గుండా కూడా ప్రయాణించాలి’ అందామె.ప్రసంగం చివర ఎమిలీ డికిన్సన్ కవితా వాక్యాన్ని కోట్ చేసింది. ‘ప్రభాతం ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ప్రతి తలుపూ తెరిచి పెడతాను’. -
ఘనంగా తమన్నా మేకప్ అకాడమీ కాన్వకేషన్ (ఫొటోలు)
-
మన రాజ్యాంగం ‘పక్కా లోకల్’
ముంబై: ‘‘భారత రాజ్యాంగం అతి గొప్ప స్వదేశీ రూపకల్పన. ఆత్మగౌరవం, స్వతంత్రం, స్వపరిపాలనకు అత్యుత్తమ కరదీపిక’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కొనియాడారు. ‘‘కానీ కొందరు దాని విజయాలను అతిగా కొనియాడుతుంటే మరికొందరు పూర్తిగా పెదవి విరుస్తుంటారు. ఇది నిజంగా బాధాకరం. మన రాజ్యాంగం ఎన్నో గొప్ప ఘనతలు సాధించిందన్నది నిస్సందేహం. అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ముఖ్యంగా భారత సమాజంలో లోతుగా వేళ్లూనుకుపోయిన అసమానతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తిని సమాజం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్నప్పుడే ఈ అసమానతలు పోతాయన్నారు. శనివారం నాగపూర్‌లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ తొలి కాన్వకేషన్‌లో సీజేఐ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్దేశిత విలువలకు కట్టుబడితే రాణిస్తారంటూ యువ న్యాయ పట్టభద్రులకు ఈ సందర్భంగా ఉద్బోధించారు. ‘‘నేడు మనం అనుభవిస్తున్న రాజ్యాంగ హక్కులు, పరిహారాలకు అంబేడ్కర్‌కు రుణపడి ఉండాలి. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆయన ప్రపంచంలోనే అతి గొప్ప సామాజిక సంస్కర్తగా ఎదిగారు’’ అంటూ కొనియాడారు. -
అమ్మమ్మ వయసులో నాలుగు గోల్డ్ మెడల్స్..!
గాంధీనగర్: చదువుకు శ్రద్ధ ఉంటే చాలు.. వయసుతో పనిలేదని నిరూపించింది ఓ మహిళ. ఏకంగా 55 ఏళ్ల వయసులో మరోసారి పుస్తకాలు పట్టుకొని కాలేజీ క్యాంపస్‌లో అడుగు పెట్టింది. లేటు వయసుసలో న్యాయవాద కోర్సును పూర్తి చేయడమే కాకుండా ఏకంగా నాలుగు గోల్డ్ మెడల్స్ కూడా సాధించి అందరిని ఔరా అనిపించింది. గుజరాత్‌కు చెందిన నీతి రావల్ అనే మహిళ సాధించిన ఈ అరుదైన ఘనత ఇప్పుడు సంచలనంగా మారింది. (ఒక్క గంటలో ఆయన సంపాదన రూ. 16వేల కోట్లు) నీతీ రావల్‌కు 30 ఏళ్ల క్రితం మౌలిన్ రావల్ అనే వ్యాపారితో వివాహం అయింది. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు. కూతురికి పెళ్లయింది. కొడుకు లాయర్‌గా స్థిరపడ్డాడు. ఏళ్లుగా కుటుంబ బాధ్యతలను మోసిన నీతి రావల్‌కి ఇంట్లో ఒంటరిగా ఉండడం నచ్చలేదు. ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. ఎవరేం అనుకున్నా పర్వాలేదని 30 ఏళ్ల తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లింది. తన కుటుంబం సాయంతో గుజరాత్ యూనివర్సిటీ నుంచి లా కంప్లీట్ చేసింది. ఇటీవల జరిగిన కాన్వొకేషన్ డేలో 4 గోల్డ్ మెడల్స్ అందుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆమెలో ఉన్న ఆసక్తి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా నీతీ రావల్ ఇంతటితో ఆగిపోవడం లేదు. త్వరలోనే మాస్టర్ ఇన్ లా అడ్మిషన్ కూడా పూర్తి చేస్తానని చెప్తోంది. నీతి రావల్ మాట్లాడుతూ.. నాకు ఒక్క దానికే ఇంట్లో ఏం చేయాలో తోచలేదు. అందుకే ఏదైనా చేయాలని అనుకొని లా పూర్తి చేసినట్టు తెలిపారు. ఆమె భర్త మౌలిన్ రావల్ మాట్లాడుతూ.. పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. టెక్ దిగ్గజం ఐబీఎం సీఈఓగా మనోడే..! -
అమితాబ్‌కి బిగ్ ఫ్యాన్‌ని
ముంబై: ముంబైలోని ఐఐటీ బాంబే కాన్వకేషన్ హాలు. అక్కడ వార్షిక శాస్త్ర, సాంకేతిక ఫెస్టివల్ జరుగుతోంది. అందులో ఒక రోబో అందరి దృష్టినీ ఆకర్షించింది. 5వేలకు పైగా టెక్నాలజీ ప్రేమికులు మానవ లక్షణాలున్న ఆ రోబోను చూసి ఫిదా అయ్యారు. అదేమీ అల్లాటప్పా రోబో కాదు. ఆ రోబో ఒక మహా నటుడు. 5 అడుగుల 9 అంగుళాలున్న ఆ రోబో బరువు 33 కేజీలు. బోంబే ఐఐటీ సైన్స్ ఫెస్టివల్లో ఆ రోబో అచ్చంగా మనిషి మాదిరిగా అన్నీ చేస్తూ ఉండడం చేసి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు. ఈ రోబో ప్రేక్షకులతో మాట్లాడడమే కాదు, వారు అడిగిన ప్రశ్నలకూ సమాధానం ఇచ్చాడు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తనకెంతో ఇష్టమని చెబుతూనే రోబో పాత్రల్ని వేసిన రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లను గుర్తు చేసుకున్నాడు. ఎప్పటికైనా ఆస్కార్ అవార్డు సాధిస్తానని ధీమాగా చెప్పాడు. హుందాగా నడవడం, స్టెప్పులేసినప్పుడు మనిషిలా శరీరాన్ని వంపులు తిప్పడం, ఎస్సీడీ కళ్లతో హావభావాల్ని పలికిస్తూ ప్రేక్షకుల్ని ఈ రోబో కట్టి పడేసింది. తన టెక్నికల్ స్పెసిఫికేషన్లను చెప్పేయడంతో హాలంతా చప్పట్లతో మారుమోగింది. -
ఘనంగా ఓయూ 80వ స్నాతకోత్సవం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం 80వ స్నాతకోత్సవాలకు విశ్వవిద్యాలయం చాన్స్‌లర్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత జరిగిన స్నాతకోత్సవంలో 270 మంది విద్యార్థులకు గవర్నర్ బంగారు పతకాలను అందజేశారు. అలాగే పీహెచ్డీ పూర్తి చేసిన 680 మంది విద్యార్థులు డాక్టరేట్ పట్టాలను గవర్నర్ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ...విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులు, ఆచార్యులను విస్మరించరాదని హితవు పలికారు. విశ్వవిద్యాలయంలో విద్యతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని అన్నారు. ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌ను విద్యార్థులు రోల్ మోడల్‌గా తీసుకోవాలన్నారు. మానవత్వమే ప్రతి ఒక్కరి జీవన విధానంగా మారాలని పేర్కొన్న గవర్నర్... సమాజం కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేలా విద్యావిధానం ఎదగాలన్నారు. ఓయూ.. భారత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అని కొనియాడారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు యూనివర్సిటీ గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాల వైస్‌చాన్స్‌లర్ ప్రొ. రామచంద్రం, ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. -
పెళ్లి అనేది తప్పనిసరి కాదు.. ఒక అవసరం : గవర్నర్
పనాజి : పవిత్రమైన వివాహ బంధాన్ని కలకాలం కాపాడుకోవాలంటూ గోవా గవర్నర్ మృదులా సిన్హా విద్యార్థులకు సూచించారు. గోవా యూనివర్సిటీ 30వ స్నాతకోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆమె విద్యార్థులతో ఐదు ప్రమాణాలు చేయించారు. మహిళా సాధికారతకు కృషి చేయడం, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించాలనే ఆలోచన దరి చేరకుండా చూసుకోవడం, చిన్న చిన్న గొడవలకే వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకూదనే భావన పెంపొందించుకోవడం వంటి విషయాల పట్ల యువత శ్రద్ధ కలిగి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. స్నాతకోత్సవంలో భాగంగా సర్టిఫికెట్లు అందుకునేందుకు హాజరైన 9 వేల మంది విద్యార్థులను ఉద్దేశించి మృదులా సిన్హా ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి, ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ ఆవశ్యకతను వివరించారు. ‘ పెళ్లి అనేది తప్పనిసరి కాదు.. కానీ అవసరం. ఒక్కసారి వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత.. ఆ బంధాన్ని కాపాడుకునేందుకు కృషి చేయాలి. భార్యభర్తలు పరస్పర అవగాహన కలిగి ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగేందుకు అవకాశం ఉంటుందంటూ’ ఆమె వ్యాఖ్యానించారు. మహిళలను కించపరిచే సంఘటనలు జరిగినపుడు, వారు ప్రమాదంలో ఉన్నపుడు ప్రాణాలకు తెగించైనా సరే వారిని కాపాడాలంటూ పిలుపునిచ్చారు. -
ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయ స్నాతకోత్సవం
-
రేపు ఎన్జీరంగా వర్సిటీ స్నాతకోత్సవం
రాజమండ్రి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవం సోమవారం రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో నిర్వహించనున్నట్టు వైస్ చాన్సలర్ అల్లూరి పద్మరాజు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సంబంధించిన చివరి స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. 575 మంది విద్యార్థులు స్నాతకోత్సవంలో పట్టాలు అందుకోనున్నారని, మిగిలిన 500 మందికి పోస్టు ద్వారా పంపిస్తామన్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పద్మరాజు తెలిపారు. ఆయనకు గౌరవ డాక్టరేట్‌తో పాటు వివిధ విభాగాలలో పలువురికి అవార్డులను అందించనున్నట్టు వీసీ చెప్పారు.