ఎన్‌ఐఏ కొత్త డీజీగా వైసీ మోదీ
Published Mon, Sep 18 2017 12:25 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం రెండు కీలక నియమాలను చేపట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వైసీ మోదీ నియమిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న శరద్ కుమార్ పదవి బాధ్యతలు అక్టోబర్ 30తో ముగియనుంది. 1984 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన మోదీ గుజరాత్ అల్లర‍్ల కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బృందంలో సభ్యుడిగా పని చేశారు. మరోవైపు సహస్ర సీమ బల్ కు చీఫ్‌గా రజనీకాంత్ మిశ్రాను కేంద్రం నియమించింది.
Advertisement
Advertisement