'కేజీ బేసిన్ స్కామ్ పై మోడీ, రాహుల్ మౌనమెందుకు?'
'కేజీ బేసిన్ స్కామ్ పై మోడీ, రాహుల్ మౌనమెందుకు?'
Published Wed, Feb 19 2014 11:30 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
కామన్ వెల్త్ కుంభకోణం, 2జీ, ఆదర్శ్ , ఇరిగేషన్ కుంభకోణాలు బహిర్గతమైనప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్నిఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాహుల్, మోడీలను ఎన్నుకోవాల్సిన దుస్థితి ఈ దేశానికి పట్టలేదు అని యాదవ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పీకల్లోతు కుంభకోణాల్లో కూరుకుపోయాయి అని ఆరోపించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై అనేక అనుమానాలు నెలకొన్నాయన్నారు. కామన్ మ్యాన్ గా చెప్పుకునే మోడీ.. గుజరాత్ లో ఆదానీ గ్రూప్ పెరుగుదల గురించి చెప్పాలని నిలదీశారు.
అతితక్కువ ధరకే ఆదాని గ్రూప్ కు భూములు కేటాయింపులు జరిపిన మోడీ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, యుద్ధంలో భర్తను కోల్పోయిన వితంతువుకు మార్కెట్ రేటు ప్రకారం భూమిని కేటాయిస్తామని చెప్పడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుపట్టింది. కేజీ బేసిన్ గ్యాస్ కుంభకోణంలో మోడీ, రాహుల్ ఎందుకు మౌనం వహిస్తున్నారని యాదవ్ ప్రశ్నించారు.
Advertisement
Advertisement