మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు?!
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ పెట్టుబడులపై చైనాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఘాటుగా సామాధానం చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి చేసేందుకు జపాన్- సంయుక్తంగా ముందుకు సాగుతాయని.. అందులో బయటి దేశాల జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. భారత్ సార్వభౌమాధికారం కలిగిన దేశం అని.. ఈ విషయాన్ని చైనా గుర్తుంచుకుని వ్యాఖ్యలు చేయాలని సూచించారు. సరిహద్దుల లోపల ఏం చేయాలి? ఎలా చేయాలి? అబివృద్ధి పనులకు ఎవరి సహకారం తీసుకోవాలి? అన్న అంశాలపై సొంత నిర్ణయం తీసుకునే హక్కు మాకుంది. మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు ఏ దేశానికి లేదు అని అమిత్ షా చెప్పారు.
సరిహద్దు ప్రాంతాల్లో జపాన్‌తో కలిసి సంయుక్తంగా పెట్టుబడులు పెట్టడంపై చైనా శనివారం ఉదయం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో మూడో దేశం జోక్యం చేసుకోవడం మంచిది కాదంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన అధికార ప్రతినిధి హువా చున్యింగ్ పేర్కాన్నారు. ఇండో-చైనా సరిహద్దులపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని పరోక్షంగా చైనాకు అమిత్ షా చురకలు అంటించారు.