యువ సినీ నిర్మాత ఆత్మహత్య... | young producer suicide | Sakshi
Sakshi News home page

యువ సినీ నిర్మాత ఆత్మహత్య...

Published Mon, May 15 2017 10:56 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

యువ సినీ నిర్మాత ఆత్మహత్య...

యువ సినీ నిర్మాత ఆత్మహత్య...

పూణె: యువ సినీ నిర్మాత ఆత్మహత్య  చేసుకున్నాడు. మహరాష్ట్రకు చెందిన అతుల్‌ బి టప్కిర్‌(35) అనే యువ నిర్మాత పూణేలోని ఓ హోటల్‌లో ఆదివారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిత్ర నిర్మాణాలతో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తన ఫేస్‌బుక్‌ అకౌంట్లో పోస్ట్‌ చేసుకున్నాడు. పోలీసులు హోటల్‌ గది బద్దలు కొట్టి మృతదేహాన్ని వెలికితీశారు. శనివారం ఫేస్‌బుక్‌ అకౌంట్లో తాను నిర్మంచిన దోల్‌ థాసే చిత్రంతో ఆర్థికంగా నష్టపోయినట్లు పోస్టు చేశాడు. తనకు తనకుటుంబంలో తన తండ్రి, సోదరి తనను ప్రొత్సహించినా, భార్య మాత్రం హింసించేదని తన వాల్‌పై రాసుకున్నాడు.

భార్య పిల్లలను తననుంచి దూరం చేసిందని, తనపై పలుమార్లు ఆరోపణలు చేసిందని ఆవేదన అతుల్‌ వ్యక్త చేశాడు. తనను ఇరుగుపొరుగుల మధ్య అవమాన పరిచిందని చెప్పాడు. భార్య అన్నలు తనని కొట్టారని చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టిందని వాపోయాడు. పోలీసుస్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేసినప్పడు ఎదుటివారి వాదనలు కూడా వినేలా పోలీసులకు చెప్పమని ముఖ్యమంత్రిని కోరాడు. తన మరణం తర్వాత పిల్లలను పట్టించుకోదని తన తండ్రి వారి ఆలన పాలన చూడాలని కోరాడు. తనను  ఏవిధంగా బాధపెట్టారో అన్ని వివారాలు తన పెన్‌డ్రైవ్‌లో సేవ్‌ చేసినట్లు అతుల్‌ తన ఫేస్‌బుక్‌ వాల్‌పై రాసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement