భువనేశ్వర్: రాష్ట్రాల విభజన ప్రక్రియ ఒక్క ఆంధ్రప్రదేశ్తోనే ఆగిపోదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తమ లబ్ధి కోసం ఏ రాష్ట్రాన్నైనా విడదీసే అవకాశంఉందని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 సవరణకు జరుగుతున్న పోరులో సహకరించాలని ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ను కోరినట్లు తెలిపారు. నవీన్ పట్నాయక్తో సమావేశం ముగిసిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరిచేయాలని కోరినట్లు జగన్ తెలిపారు. అసెంబ్లీ సహా పార్లమెంటులోనూ 2/3 మెజార్టీతో విభజన తీర్మానాన్ని ఆమోదించేలా రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దిశలోనే తాము ప్రయత్నాలుచేస్తున్నట్లు తెలిపారు. అందుకోసమే నవీన్ పట్నాయక్ను కలిసినట్లు జగన్ చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరి సహాయాన్ని కోరుతున్నామన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో తమకు అనుబంధం ఉందని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని జగన్ స్పష్టం చేశారు.
రాష్ట్రాల విభజనపై వైఎస్ జగన్ హెచ్చరిక
Published Sun, Nov 24 2013 3:40 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement