
సామాన్యులు ఇబ్బంది పడకుండా చూడండి
అఖిలపక్ష భేటీలో వైఎస్సార్‌సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీతకు తాము వ్యతిరేకం కాదని, సరైన ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఉన్నపళంగా పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల సామాన్యులు ఇబ్బందుల పాలయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో ఉత్పన్నమైన సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. బుధవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండడంతో కేంద్రం మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించాలని విజయసారుురెడ్డి సూచించారు. సామాన్యులకు అసౌకర్యం జరగకుండా చూడాలన్నదే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. పార్టీ ఫిరారుుంపుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ సమస్యను అలాగే వదిలేస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. ఈ సమస్యపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని ఆయన చెప్పారు.
ఇబ్బందుల్లేకుండా చూడాలని కోరాం
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, బ్యాంకులకు తగిన మొత్తంలో డబ్బు సరఫరా చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరినట్టు టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం తెలిపారు.