న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా: రోజా | YSRCP mla roja speaks to media at supreme court | Sakshi
Sakshi News home page

న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా: రోజా

Published Fri, Apr 22 2016 2:58 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా: రోజా - Sakshi

న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా: రోజా

న్యూఢిల్లీ: తాను ఎవరినీ బాధపెట్టేలా వ్యాఖ్యలు చేయలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తన వ్యాఖ్యలపై ఎవరైనా బాధపడుంటే ఉపసంహరించుకుంటానని ఆమె తెలిపారు. తన సస్పెన్షన్ను సవాలు చేస్తూ రోజా దాఖలు చేసిన పిటిషన్పై  శుక్రవారం  సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  తాను ఇచ్చిన వివరణ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించటంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.

కాల్మనీ అంశంలో మహిళల సమస్యలపై పోరాడానని, అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించి పరిష్కరించమని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఆమె అన్నారు. అసెంబ్లీ ఆవరణలో తనను ఎవరైనా అడ్డుకుంటే సీరియస్గా పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు రోజా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement