ఎప్పుడూ ఆఫర్లను అందించే ప్రముఖ ఆహార సంస్థ జొమాటోకు ఓ డౌట్ వచ్చింది. ఆఫర్లు పెడితే చాలు.. ఆహారాన్ని ఎగబడి కొనే జనం దాన్ని ఉచితంగా సంపాదించడానికి ఏం చేస్తారబ్బా అని ఓ ప్రశ్న తలెత్తింది. దీంతో వెంటనే ‘ఉత్తిపుణ్యానికే ఆహారం తినడానికి ఏం చేశారో చెప్మా?’ అని చిలిపి ప్రశ్న విసిరింది. క్షణం ఆలస్యం! జనాలు లెక్కలేనన్ని సమాధానాలతో జొమాటోను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ‘ఏముంది, బంధువుల పెళ్లికో, ఫంక్షన్‌కో వెళితే చాలు, తిన్నోడిని తిన్నంత’, ‘మాజీ ప్రియుడు/ ప్రియురాలి పెళ్లికి వెళ్తే ఉచితంగా విందు భోజనం’ అని కొందరు కొంటెగా కామెంట్ చేస్తున్నారు.
‘ఫ్యామిలీతో వెళ్లినా మనం చిల్లిగవ్వ ఖర్చు పెట్టకుండా తినొచ్చు!’ అని కొందరు పిసినారితనాన్ని ప్రదర్శిస్తూ కామెంట్ చేశారు. ‘రాత్రి 10 దాటిపోయినా ఆఫీసులోనే ఏదో పని చేస్తున్నట్టు నటిస్తే చచ్చినట్టు హెచ్‌ఆర్ వాళ్లే భోజనం పట్టుకొస్తారు’, ‘పార్టీ ఇవ్వమని పక్కనోడిని వేపుకుతింటే ఆహారం అప్పనంగా దొరుకుతుంది’, ‘పిలవని పేరంటానికి వెళ్లినా కావలసినంత ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది’ అని చమత్కార సమాధానాలు ఇస్తున్నారు. ఇలాంటి సరదా సమాధానాలకు కొదవేం లేదు గానీ మరి మీరు కూడా ఫ్రీగా ఫుడ్ దొరకడానికి ఏం చేశారో ఆలోచించుకొని సరదాగా నవ్వుకోండి.
Comments
Please login to add a commentAdd a comment